గోవాలో పూరీ అండ్‌ టీం

Mon,November 11, 2019 05:46 PM


పూరీజగన్నాథ్‌ కుమారుడు ఆకాశ్‌ పూరీ నటిస్తోన్న చిత్రం రొమాంటిక్‌. కేతిక శర్మ హీరోయిన్‌గా నటిస్తోంది. ఆకాశ్‌ తొలి చిత్రం మెహబూబా ఆశించిన విజయాన్ని సాధించకపోవడంతో.. అతని రెండో చిత్రంపై డైరెక్టర్‌ పూరీ జగన్నాథ్‌ చాలా శ్రద్ధ తీసుకుంటున్నాడు. ప్రస్తుతం పూరీ, ఆకాశ్‌ అండ్‌ టీం ఈ సినిమా కోసం గోవాలో చక్కర్లు కొడుతున్నారు. గోవాలో కీలక సన్నివేశాలను చిత్రీకరిస్తున్నారు. సుమారు 30 రోజుల షూటింగ్‌ షెడ్యూల్‌ లో యాక్షన్‌ సన్నివేశాలు, పాటలను షూట్‌ చేయనుంది చిత్రయూనిట్‌. కొత్త దర్శకుడు అనిల్‌ పాడూరి ఈ సినిమాను డైరెక్ట్‌ చేస్తున్నాడు. సునిల్‌ కాశ్యప్‌ మ్యూజిక్‌డైరెక్టర్‌. పూరీ, ఛార్మీకౌర్‌ సంయుక్తంగా రొమాంటిక్‌ను తెరకెక్కిస్తున్నారు. రమ్యకృష్ణ ఈ చిత్రంలో కీలక పాత్రలో నటిస్తోంది.

1459
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles