చిరు, బాలయ్య డైలాగ్స్ చెప్పి వేషమడిగేవాడు: పూరీ

Mon,April 23, 2018 07:43 PM
Puri jagannadh revealed mehbooba second song


హైదరాబాద్ : ఆకాశ్ పూరీ, నేహాశెట్టి హీరోహీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం మెహబూబా. పూరీ జగన్నాథ్ దర్శకత్వం వహిస్తున్నాడు. ఈ సినిమా రెండో సాంగ్‌ను చిత్రయూనిట్ విడుదల చేసింది. ఈ సందర్భంగా డైరెక్టర్ పూరీ జగన్నాథ్ మాట్లాడుతూ..తాను ఇప్పటికి 25 సినిమాలు తీశానని, కానీ మెహబూబా సినిమాతో ఓ నిజాయితీ మూవీ తీశాననే భావన కలిగిందన్నాడు. ఆకాశ్ చిన్నపుడు ఉదయం లేవగానే నా ముందుకొచ్చి నిలబడేవాడు. చిరంజీవి, బాలకఋష్ణ డైలాగ్స్ చెప్పి తనకు ఓ వేషమివ్వమనేవాడని పూరీ అన్నాడు. ఆకాశ్ టార్చర్ తట్టుకోలేక పోకిరి సినిమాలో క్యారెక్టర్ ఇచ్చాను. టైం కలిసొచ్చి మొత్తానికి ఇపుడు వాడితోనే సినిమా తీశాను. నువ్వు మనసు పెట్టి సినిమా తీస్తే ఇలా ఉంటుంది భయ్యా అని దిల్‌రాజ్ మెచ్చుకున్నారు. ఆయన సినిమా విడుదల చేస్తున్నారనగానే నాకు చాలా మంది నుంచి ఫోన్లు వచ్చాయి. మెహబూబా చిత్రం హిట్ అవుతుందని మాకు విశ్వాసం ఉందని పూరీ అన్నాడు. 1971లో జరిగిన ఇండో పాక్ యుద్ధం నేప‌థ్యంలో జరిగిన లవ్ స్టోరీ బ్యాక్ డ్రాప్ తో ఈ మూవీ తెరకెక్కించాడు పూరీ.

5054
Follow us on : Facebook | Twitter
Namasthe Telangana Property Show

More News

VIRAL NEWS

Namasthe Telangana Property Show

Featured Articles