పూరీతో స్టెప్పులేసిన ఛార్మి.. వైర‌ల్‌గా మారిన వీడియో

Sun,January 21, 2018 05:24 PM
Puri Jagannadh and Charmi dance video goes viral

పంజాబీ ముద్దుగుమ్మ ఛార్మి ఒక‌ప్పుడు స్టార్ హీరోల స‌ర‌స‌న క‌థానాయిక‌గా న‌టించి అల‌రించింది. కొంత కాలంగా న‌టన‌కు దూరంగా ఉంటూ పూరీ సినిమాల‌కి సంబంధించి ప్రొడ‌క్ష‌న్ బాధ్య‌త‌లు చూసుకుంటుంది. అయితే ప్ర‌స్తుతం పూరీ జ‌గ‌న్నాథ్ త‌న కొడుకు ఆకాశ్ హీరోగా మెహ‌బూబా అనే సినిమా చేస్తుండ‌గా, ఈ సినిమా ఇండియాలోని ప‌లు ప్రాంతాల‌లో షూటింగ్ జ‌రుపుకుంటుంది. వీటికి సంబంధించిన అప్‌డేట్స్ ఎప్ప‌టిక‌ప్పుడు తన ట్విట్ట‌ర్ ద్వారా అందిస్తూనే ఉంటుంది ఛార్మి. ఇక ఈ మ‌ధ్య చిత్ర బృందం అంతా క‌లిసి స‌ర‌దాగా పార్టీ సెల‌బ్రేట్ చేసుకోగా, దీనికి సంబంధించిన వీడియో కూడా బ‌య‌ట‌కి వ‌చ్చింది. తాజాగా పూరీ, చార్మి, ఆకాష్, హీరోయిన్ నేహా శెట్టి.. మిగతా కాస్ట్ అండ్ క్రూ అంతా కలిసి ప‌బ్‌లో పార్టీ చేసుకున్నార‌ట‌. దీనికి సంబంధించిన వీడియో ప్ర‌స్తుతం సోష‌ల్ మీడియాలో వైర‌ల్‌గా మారింది. ఈ వీడియోలో ఛార్మి త‌న దైన శైలిలో స్టెప్పులు వేయ‌గా, పూరీ కూడా వారితో పాదం క‌లిపాడు.

4958
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles