పునాది రాళ్ళు చిత్ర ద‌ర్శ‌కుడికి ఆర్ధిక సాయం

Thu,November 21, 2019 11:34 AM

మెగాస్టార్ చిరంజీవి న‌ట‌ప్ర‌స్థానం పునాది రాళ్ళు చిత్రంతో ప్రారంభ‌మైన సంగ‌తి తెలిసిందే. ఈ చిత్రం ఇటీవ‌ల 40 ఏళ్ళ ప్ర‌స్థానం ముగించుకుంది. గూడ‌పాటి రాజ్‌కుమార్ ఈ ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్కిన ఈ మూవీలో చిరు త‌న న‌ట‌న‌తో ఎంత‌గానో ఆక‌ట్టుకున్నాడు. అయితే చిత్ర‌ ద‌ర్శ‌కుడు రాజ్‌కుమార్ కొన్నాళ్లుగా అనారోగ్యంతో బాధ‌ప‌డుతున్నారు. వైద్యం చేయించుకునేందుకు కూడా డ‌బ్బు ఆయ‌న ద‌గ్గ‌ర లేక‌పోవ‌డంతో ప‌లువురు సినీ సెల‌బ్రిటీలు ఆయ‌న‌కి త‌మ‌కి తోచినంత సాయం చేస్తున్నారు.


తాజాగా ఇస్మార్ట్ డైరెక్ట‌ర్ పూరి జగన్నాథ్‌ రూ.50 వేలు, మెహర్‌ రమేష్‌ రూ.10 వేలు, కాశీవిశ్వనాథ్‌ రూ.5 వేలు చొప్పున గూడ‌పాటి రాజ్‌కుమార్ ఆర్థిక సహాయం అందించారు. ప్రసాద్స్‌ క్రియేటివ్‌ మెంటర్స్‌ ఫిలిం మీడియా స్కూల్‌ మేనేజింగ్‌ పార్ట్‌నర్‌ సురేష్‌రెడ్డి రూ.41వేలు అందజేశారు. ‘మనం సైతం’ తరఫున నటుడు కాదంబరి కిరణ్‌కుమార్‌ రూ.25 వేల నగదు అందజేశారు. త‌న‌కి సాయం చేసిన వారంద‌రికి ప్ర‌త్యేక కృత‌జ్ఞ‌తలు తెలిపారు రాజ్‌కుమార్.

2600
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles