ఎన్టీఆర్ సెట్లోకి అడుగుపెట్ట‌నున్న పురందేశ్వ‌రి

Tue,October 2, 2018 10:54 AM
Purandeswari  enters into ntr biopic

నంద‌మూరి ఎన్టీఆర్ జీవిత నేప‌థ్యంలో తెర‌కెక్కుతున్న ఎన్టీఆర్ చిత్రం మ‌రో షెడ్యూల్‌ని ఈ వారం నుండే మొద‌లు పెట్ట‌నుంది. సీనియర్ ఎన్టీఆర్ చైతన్య రథంపై తన చారిత్రాత్మక ఎన్నికల ప్రచారాన్ని ప్రారంభించిన శ్రీకాకుళంలోనే షూట్ చేయనున్నారు. తన తండ్రి హరికృష్ణ పాత్రలో నటిస్తున్న ‘నందమూరి కళ్యాణ్ రామ్’ కూడా శ్రీకాకుళంలో జరిగే షూట్ లో పాల్గొననున్నాడు. ఇక ఎన్టీఆర్ కూతురు పురందేశ్వ‌రిగా న‌టిస్తున్న హిమాన్సీ కూడా ఈ నెల మూడో తారీఖు నుండి చిత్ర బృందంతో కల‌వ‌నుంద‌ట‌. ఇన్ని రోజులు పురంధేశ్వ‌రి హావ‌భావాలు, ఆమె పాత్ర‌లో ఎలా న‌టించాలో అనే దానిపై రిహార్స‌ల్స్ చేసింద‌ట‌.

ఎన్టీఆర్ స‌తీమ‌ణి బ‌స‌వ‌తార‌కం పాత్ర‌లో న‌టిస్తున్న విద్యా బాల‌న్ పాత్ర‌కి సంబంధించి కూడా ఈ షెడ్యూల్‌లో కొన్ని సీన్స్ షూట్ చేయ‌నున్నార‌ట‌. కీర‌వాణి సంగీతం అందిస్తున్న ఈ చిత్రం సంక్రాంతి కానుక‌గా జ‌న‌వ‌రి 9న విడుద‌ల కానుంది. ఈ చిత్రానికి ప్రముఖ నిర్మాత సాయి కొర్రపాటి, యువ నిర్మాత విష్ణు సహ నిర్మాతలుగా వ్యవహరిస్తున్నారు. ఎపీ సీఎం చంద్రబాబు నాయుడు పాత్రని రానా పోషిస్తుండ‌గా, ఆయన భార్య భువనేశ్వరి పాత్రలో మలయాళనటి మంజిమా మోహన్ నటిస్తున్నట్టు తెలుస్తుంది. శ్రీదేవిగా రకుల్ ప్రీత్ సింగ్, అక్కినేని నాగేశ్వరరావుగా సుమంత్ , హెచ్ఎమ్ రెడ్డి కోసం సీనియర్ నటుడు కైకాల సత్యనారాయణ, దగ్గుబాటి వెంకటేశ్వరరావుగా భరత్ రెడ్డి నటిస్తున్నారు. ఎస్వీఆర్ పాత్ర కోసం మెగా బ్రదర్ నాగబాబు నటిస్తున్నాడు అని స‌మాచారం.

4177
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles