భార్య‌కి ఖ‌రీదైన కారు గిఫ్ట్‌గా ఇచ్చిన హీరో

Sat,March 9, 2019 10:22 AM
Puneeth Rajkumar gives car gift to his wife

మార్చి 8న అంత‌ర్జాతీయ మ‌హిళా దినోత్స‌వ వేడుక‌లు ఘ‌నంగా జ‌రిగాయి. స్త్రీ ఔన్న‌త్యాన్ని చాటుతూ సోష‌ల్ మీడియాలో విప‌రీతంగా పోస్ట్‌లు పెట్టారు నెటిజ‌న్స్. ఇక కొంద‌రైతే త‌మ ఫ్యామిలీకి చెందిన వారికి ఖరీదైన బ‌హుమ‌తుల‌ని గిఫ్ట్‌గా ఇచ్చారు. ఈ క్ర‌మంలో క‌న్న‌డ స్టార్ హీరో పునీత్ రాజ్ కుమార్ మ‌హిళా దినోత్స‌వం సంద‌ర్భంగా త‌న భార్య అశ్వినికి 5 కోట్ల విలువ చేసే ల్యాంబోర్గిని కారుని బ‌హుమ‌తిగా ఇచ్చి స‌ర్‌ప్రైజ్ చేశాడ‌ట‌. గ‌తంలో జాగ్వార్ కారుని త‌న భార్య‌కి గిఫ్ట్‌గా ఇచ్చాడు పునీత్‌.

గ‌త ఏడాది పునీత్ రాజ్‌కుమార్ నట సార్వభౌమ అనే సినిమా షూటింగ్ ముగించుకుని బళ్ళారి నుంచి బెంగళూరు వెళ్తుండగా కారు ప్రమాదం జరిగిన విష‌యం తెలిసిందే. తృటిలో పెను ప్ర‌మాదం నుండి త‌ప్పించుకున్న పునీత్ సుర‌క్షితంగా బ‌య‌ట‌ప‌డ్డారు. పునీత్ రాజ్ కుమార్ క‌న్న‌డ కంఠీర‌వం రాజ్ కుమార్ త‌న‌యుడు అన్న సంగ‌తి తెలిసిందే. రాజ్‌కుమార్‌-పార్వతమ్మ దంపతులకు మొత్తం ఐదుగురు సంతానం ఉండ‌గా, వీరి తనయులైన పునీత్‌ రాజకుమార్‌, శివరాజ్‌కుమార్‌ ప్రస్తుతం కన్నడ అగ్ర హీరోలుగా ఉన్నారు .

6825
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles