ప్రేమ‌జంట‌కి చెక్ పెట్టిన బిగ్ బాస్..!

Sat,October 5, 2019 08:54 PM

బిగ్ బాస్ హౌజ్‌లో రొమాంటిక్ క‌పుల్‌గా పేరు తెచ్చుకున్న జంట రాహుల్, పున‌ర్న‌వి. వీరిద్ద‌రు చేసే చిలిపి అల్ల‌ర్లు ప్రేక్షకుల‌కి కాస్త స‌ర‌దాతో పాటు వినోదాన్ని అందించాయి. ఇప్పుడు వీరిద్ద‌రి మ‌ధ్య బాండింగ్ ఎంత స్ట్రాంగ్ అయింద‌టే ఒక‌రినొక‌రు వ‌దిలి ఉండ‌లేనంత‌. ఇటీవ‌ల ఫేక్ ఎలిమినేష‌న్‌లో భాగంగా రాహుల్ ఇంటి నుండి బ‌య‌ట‌కి వెళ్ల‌డంతో పున‌ర్న‌వి తీవ్ర భావోద్వేగానికి గురైంది. ఆ వీక్ అంత చాలా డ‌ల్‌గా క‌నిపించింది. కాని రాహుల్ తిరిగి ఇంట్లోకి ఎంట్రీ ఇచ్చాడ‌ని తెలిసి ఎగ‌రి గంతేసింది. అయితే ఈ వారం మాత్రం బిగ్ బాస్ ఈ ప్రేమ‌జంట‌కి చెక్ పెట్టాడ‌ని తెలుస్తుంది. ప‌దకొండో వారంలో పున‌ర్న‌వి, వ‌రుణ్ సందేశ్, మ‌హేష్‌, రాహుల్ నామినేష‌న్‌లో ఉండ‌గా.. ఈ వారం ఇంటి నుండి పున‌ర్నవిని బయ‌ట‌కి పంపించనున్న‌ట్టు టాక్. పున్ను చేసే ఓవ‌రాక్ష‌న్‌తో పాటు టాస్క్ స‌మయంలో లేదా గొడ‌వ జ‌రిగిన‌ప్పుడు ఆమె ప్ర‌వ‌ర్తించే తీరు నెటిజ‌న్స్‌కి విసుగు పుట్టించింద‌ని అంటున్నారు. ఈ క్ర‌మంలో ప‌ద‌కొండో వారం పున‌ర్న‌విని ఇంటి నుండి బయ‌ట‌కి పంపించ‌నున్న‌ట్టు తెలుస్తుంది. మ‌రి పున్ను తోడు లేని రాహుల్ బిగ్ బాస్ హౌజ్‌లో ఎలా ఉంటాడో చూడాలి.

24068
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles