మోహన్ లాల్ మూవీ 100 నాటౌట్

Tue,January 17, 2017 08:17 AM
PULIMURUGAN completes 100 days run

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన క్రేజీ ప్రాజెక్ట్ పులిమురుగన్. జగపతి బాబు, కమలినీ ముఖర్జీ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు వైశాఖ దర్శకత్వం వహించాడు. దసరాకి విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ సునామి సృష్టించింది. ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టడంతో ఇప్పటి వరకు ఈ చిత్రం 150 కోట్ల కలెక్షన్లు సాధించిందని చెబుతున్నారు. అయితే తాజాగా ఈ మూవీ వంద రోజులని పూర్తి చేసుకొని సక్సెస్ ఫుల్ రన్ కొనసాగిస్తూనే ఉంది. వంద రోజులు పూర్తైన సందర్భంగా చిత్ర యూనిట్ కేక్ కట్ చేసి సెలబ్రేషన్స్ జరుపుకుంది. పులిమురుగన్ చిత్రం తెలుగులో మన్యం పులి టైటిల్ తో విడుదల కాగా ఇక్కడ కూడా ఈ చిత్రానికి విశేష ఆదరణ లభించింది. గత ఏడాది మోహన్ లాల్ నటించిన అన్ని చిత్రాలకు మంచి రెస్పాన్స్ రాగా, ఈ ఏడాది కూడా విభిన్నమైన కథలతో ఆడియన్స్ ముందుకు వచ్చేందుకు సన్నద్దం అవుతున్నాడు.


1447
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles