బాక్సాఫీస్ ని షేక్ చేస్తోన్న పులిమురుగన్

Sat,February 4, 2017 10:24 AM
Pulimurugan break down the records

మలయాళ సూపర్ స్టార్ మోహన్ లాల్ నటించిన క్రేజీ ప్రాజెక్ట్ పులిమురుగన్. జగపతి బాబు, కమలినీ ముఖర్జీ కీలక పాత్రల్లో నటించిన ఈ సినిమాకు వైశాఖ దర్శకత్వం వహించాడు. దసరాకి విడుదలైన ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద వసూళ్ళ సునామి సృష్టించింది. ఈ చిత్రం తెలుగులోను మన్యం పులి టైటిల్ తో విడుదలై మంచి విజయం సాధించింది. ప్రేక్షకులు ఈ చిత్రానికి బ్రహ్మరథం పట్టడంతో ఇప్పటి వరకు ఈ చిత్రం 163 కోట్ల కలెక్షన్లు సాధించిందని చెబుతున్నారు. గతంలో ఏ చిత్రం ఈ ఫిగర్ ని చేరలేదని ట్రేడ్ పండితులు అంటున్నారు.

తాజా సమాచారం ప్రకారం కేరళలో పులి మురుగన్ చిత్ర కలెక్షన్స్ 85.70 కోట్లు సాధించగా, మిడిల్ ఈస్ట్ 33.50 కోట్లు, రెస్టాఫ్ ఇండియా 9.50 కోట్లు, యూకే మరియు యూఎస్ 3.70 కోట్లు, రెస్టాఫ్ ది వరల్డ్ 1.50 కోట్లు, తెలుగు వర్షెన్ లో 13.50 కోట్లు మరియు శాటిలైట్, ఆడియో, ఓవర్సీస్ రైట్స్ కి 15 కోట్లు లభించాయి. ఇక త్వరలోనే పులిమురుగన్ చిత్రం డబ్బింగ్ జరుపుకొని తమిళంలో కూడా విడుదల కానుందని అంటున్నారు. బి క్లాస్ సెంటర్స్ లో ఈ చిత్రానికి మంచి వసూళ్ళు వస్తాయని నిర్మాతలు భావిస్తున్నారు. ఇక ఈ చిత్రం తాజాగా 125 రోజులని పూర్తి చేసుకొని సక్సెస్ ఫుల్ రన్ ని కొనసాగిస్తూనే ఉంది. ఏదేమైన మోహన్ లాల్ చిత్రం క్రియేట్ చేసిన ఈ సెన్సేషన్ మలయాళ ఇండస్ట్రీని పెద్ద షాక్ కి గురయ్యేలా చేసిందని అంటున్నారు.

2939
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles