‘పులి’ కోసం ఎదురుచూపులు

Thu,October 1, 2015 11:50 AM
Puli Early Morning Shows Cancelled, Vijay to Clear Dues Soon

హైదరాబాద్ : తమిళ నటుడు విజయ్, కథా నాయికలు శృతి హాసన్, హన్సిక, శ్రీదేవీ నటించిన పులి సినిమా ప్రేక్షకుల ముందుకు గురువారం రావాల్సి ఉంది. కానీ ఇంకా ఆ మూవీ విడుదల కాలేదు. పులి కోసం అభిమానులు ఎదురుచూస్తున్నారు. ఉదయం 5 గంటలకే ప్రారంభం కావాల్సిన బెనిఫిట్ షోలు రద్దు అయ్యాయి. మార్నింగ్ షో కూడా ప్రేక్షకుల ముందుకు రాలేదు. దీంతో అభిమానులు ఆందోళన చెందుతున్నారు.

అయితే పులి విడుదలకు నిన్నటి ఐటీ దాడులు కారణమేనని తెలుస్తోంది. నిన్న నటుడు విజయ్ నివాసంలో ఐటీ అధికారులు దాడి చేసిన విషయం విదితమే. ఇక ఈ చిత్రానికి పెట్టుబడులు పెట్టిన వారికి డబ్బులు చెల్లించలేదని సమాచారం. చిత్రాన్ని డిజిటల్ రూపంలో థియేటర్లకు పంపే క్యూబ్ నుంచి కూడా ఇంకా క్లియరెన్స్ రాలేదని తెలుస్తోంది. ఈ క్రమంలో విజయ్ స్పందించారు. పెండింగ్ నగదును తక్షణమే అందజేస్తామని ప్రకటించారు. ఇక మధ్యాహ్నం షో ప్రేక్షకుల ముందుకు వస్తుందో.. లేదో వేచి చూడాల్సిందే.

2333
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles