బాలయ్య చేతులమీదుగా ‘గరుడవేగ’ ట్రైలర్ లాంఛ్..

Mon,October 16, 2017 10:16 PM
PSV garudavega trailer to launch by balakrishna tomorrow


హైదరాబాద్ : టాలీవుడ్ యాక్టర్ రాజశేఖర్ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ‘పీఎస్‌వీ గరుడవేగ’ . ప్రవీణ్‌సత్తారు డైరెక్షన్‌లో వస్తున్న ఈ మూవీ ట్రైలర్‌ను నందమూరి బాలకృష్ణ లాంఛ్ చేయనున్నాడు. రేపు రాత్రి 8 గంటలకు బంజారాహిల్స్‌లోని ఆర్‌కే సినీప్లెక్స్‌లో బాలకృష్ణ గరుడ వేగ థ్రియాట్రికల్ ట్రైలర్‌ను విడుదల చేస్తారని చిత్రయూనిట్ వెల్లడించింది. దీనికి సంబంధించిన స్పెషల్ పోస్టర్‌ను రిలీజ చేసింది చిత్రయూనిట్. ఇప్పటికే రిలీజైన గరుడవేగ టీజర్ ఆడియెన్స్ నుంచి అద్భుతమైన రెస్పాన్స్ వస్తున్న సంగతి తెలిసిందే. రూ.25 కోట్ల బడ్జెట్‌తో తెరకెక్కుతున్న ఈ సినిమాలో పూజాకుమార్, అలీ, శ్రద్దాదాస్ కీలకపాత్రల్లో నటిస్తున్నారు. బాలీవుడ్ తార సన్నీలియోన్ స్పెషల్‌సాంగ్‌లో తళుక్కుమని మెరువనుంది.

1447
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles