తగలబడుతున్న బస్సులు.. మూతపడిన షాపులు!

Wed,January 24, 2018 05:35 PM
Protests in 4 states a day before release of Padmaavat

న్యూఢిల్లీః దేశవ్యాప్తంగా పద్మావత్ మూవీకి వ్యతిరేకంగా నిరసనలు తీవ్రస్థాయికి చేరాయి. ముఖ్యంగా ఆ మూవీని బ్యాన్ చేసిన నాలుగు రాష్ర్టాలు ఆందోళనలతో అట్టుడుకుతున్నాయి. సినిమా రిలీజ్‌కు ఒక రోజు ముందు హర్యానా, గుజరాత్, రాజస్థాన్, ఉత్తరప్రదేశ్‌లలో ఆందోళనకారులు రోడ్లపై వచ్చి హింసకు పాల్పడుతున్నారు. వాహనాలకు నిప్పు పెడుతున్నారు. షాపులను ధ్వంసం చేస్తున్నారు. దీంతో యూపీలోని ఇటావాలో ఆందోళనకారులపై పోలీసులు లాఠీచార్జ్ చేశారు. ఈ ఘటనలో కొందరు గాయపడ్డారు. అటు ఢిల్లీ, జైపూర్ హైవేపై ఆందోళన చేయడంతో పెద్ద ఎత్తున ట్రాఫిక్ స్తంభించిపోయింది. సినిమాను తీవ్రంగా వ్యతిరేకిస్తున్న కర్ణిసేన.. దేశవ్యాప్తంగా సినిమా రిలీజ్‌ను అడ్డుకోవాలని మరోసారి పిలుపునిచ్చింది.


రాజస్థాన్‌లో ఆందోళనల నేపథ్యంలో డిస్ట్రిబ్యూటర్లు సినిమాను రిలీజ్ చేయడానికి వెనుకడుగు వేశారు. ఢిల్లీ, జైపూర్ హైవేతోపాటు, ఢిల్లీ, అజ్మేర్ హైవేలపై ఆందోళనకారులు రోడ్లపై టైర్లు తగలబెట్టారు. సికార్‌లో బస్సుపై రాళ్లు రువ్వారు. కర్ణిసేన సభ్యులు లోపలికి రావడానికి ప్రయత్నించడంతో చరిత్రలో కేవలం రెండోసారి చిత్తోరగఢ్ కోటను మూసేశారు.
హర్యానాలోని గుర్గావ్‌లో వజీర్‌పూర్-పటౌడీ రోడ్డును ఆందోళనకారులు మూసేశారు. సోహ్నాలో ఓ బస్సుకు నిప్పంటించారు. ఆదివారం వరకు థియేటర్లకు 200 మీటర్ల పరిధిలో ఎలాంటి ఆందోళనలు నిర్వహించకూడదని ప్రభుత్వం ఆదేశాలు జారీ చేసింది. చాలా వరకు థియేటర్ల ఓనర్లు సినిమా రిలీజ్‌కు నో చెప్పారు. లక్నోలోనూ రోడ్లపైకి వచ్చి సినిమాకు వ్యతిరేకంగా ఆందోళనలు నిర్వహించారు. ముంబైలో ముందస్తు జాగ్రత్తగా 30 మంది కర్ణిసేన సభ్యులను అరెస్ట్ చేశారు. అటు అహ్మదాబాద్‌లోనూ 44 మంది సభ్యులను అదుపులోకి తీసుకున్నారు.

5012
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles