సన్నీలియోన్ ఫొటోలు, పోస్టర్లు దగ్ధం..

Fri,December 15, 2017 04:05 PM
సన్నీలియోన్ ఫొటోలు, పోస్టర్లు దగ్ధం..


బెంగళూరు: బాలీవుడ్ నటి సన్నీలియోన్‌కు వ్యతిరేకంగా ప్రొ-కన్నడ గ్రూప్ కర్నాటక రక్షణ వేదిక యువసేన ఆందోళన నిర్వహించింది. న్యూ ఇయర్ సందర్భంగా మన్యతటెక్ పార్కులో సన్నీలియోన్‌తో ఏర్పాటు చేస్తున్న ఈవెంట్‌ను రద్దు చేయాలని వారు డిమాండ్ చేశారు. ఆందోళన కారులు పెద్ద సంఖ్యలో మన్యతటెక్ పార్కు ముందు చేరి..సన్నీలియన్ ఫొటోలు, పోస్టర్లను దగ్ధం చేసి నిరసన వ్యక్తం చేశారు. సన్నీలియోన్‌తో ఈవెంట్ నిర్వహించడం భారతదేశ సంస్కృతి, సంప్రదాయాలపై దాడి చేయడమేనని యువసేన సభ్యులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. డిసెంబర్ 31న నిర్వహించనున్న ఈవెంట్‌ను రద్దు చేయకపోతే పెద్ద సంఖ్యలో ఆత్మహత్యలు జరుగుతాయని యువసేన సభ్యులు హెచ్చరించారు. సన్నీలియోన్ పొట్టి దుస్తులు ధరించి వస్తే మేం ఒప్పుకోం. ఇలాంటి వాటిని తాము ప్రోత్సహించమని..ఒకవేళ సన్నీలియోన్ సంప్రదాయబద్దంగా చీరకట్టులో వచ్చి ఈవెంట్‌లో పాల్గొంటే మేమంతా వెళ్లి చూస్తామని యువసేన రాష్ట్ర అధ్యక్షుడు హరీశ్ తెలిపాడు.

2561
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS