ఎస్ఎస్ రాజమౌళి భారీ బడ్జెట్‌తో డీవీవీ దానయ్య నిర్మాణంలో తెరకెక్కిస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. రామ్ చరణ్, జూనియర్ ఎన్టీఆర్ ప్రధాన పాత్రలలో తెరకెక్కుతున్న ఈ చిత్రంలో కథానాయికలుగా అలియా భట్, డైసీ ఎడ్గార్ జోన్స్ ని ఎంపిక చేశారు. ‘‘కొన్ని అనివార్య కారణాల వల్ల డైసీ ఎడ్గర్ జోన్స్ ఈ చిత్రంలో చేయడం లేదు. ఆమెకు మంచి భవిష్యత్తు ఉండాలని కోరుకుంటున్నాము.. ’’ అంటూ ఆర్ఆర్ఆర్ టీమ్ ఆ మధ్య తమ ట్విట్టర్ ద్వారా తెలిపింది. దీంతో ఎన్టీఆర్ సరసన ఎవరు నటిస్తారు అనే దానిపై అందరిలో ఆసక్తి నెలకొంది. మలయాళ భామ నిత్యామీనన్‌ని ఎంపిక చేసినట్టు ఆ మధ్య వార్తలు రాగా, మళ్ళీ విదేశీ భామనే ఎంపిక చేస్తారని అన్నారు. కాని తాజా సమాచారం ప్రకారం ప్రస్తుతం ఇండస్ట్రీలో దూసుకెళుతున్న మలయాళ కుట్టీ సాయి పల్లవి.. ఎన్టీఆర్‌తో జోడీ కట్టనుందని చెప్పుకొస్తున్నారు. ఇటీవలే ఆర్ఆర్ఆర్ టీం సాయి పల్లవిని సంప్రదించగా, ఆమె బల్క్ డేట్స్ ఇచ్చిందట. త్వరలోనే ఆమె టీంతో జాయిన్ కానుందని అంటున్నారు. త్వరలోనే దీనిపై అఫీషియల్ ప్రకటన రానుంది. చరణ్, ఎన్టీఆర్ గాయాల బారిన పడడం వలన ఆర్ఆర్ఆర్ చిత్ర షూటింగ్ కొన్నాళ్ళు వాయిదా పడిన విషయం తెలిసిందే. 2020లో ఈ చిత్రాన్ని పక్కా ప్రేక్షకుల ముందుకు తెచ్చేలా టీం ప్లాన్ చేస్తుంది.