ఆ నిర్మాత నాకు డ్రగ్స్ ఇచ్చి రేప్ చేశాడు!

Fri,October 12, 2018 02:18 PM
Producer Karim Morani drugged and raped me alleges a woman from New Delhi

మీ టూ ఉద్యమంలో భాగంగా రోజుకో బాధితురాలు బయటకు వచ్చి తమపై జరిగిన అఘాయిత్యాల గురించి చెప్పుకుంటున్నది. తాజాగా నటి కావాలని ఆశపడిన ఢిల్లీకి చెందిన మహిళ కూడా ఇలాంటి ఆరోపణలే చేసింది. బాలీవుడ్ నిర్మాత కరీం మొరానీ తనకు డ్రగ్స్ ఇచ్చి, తర్వాత అత్యాచారం చేశాడని ఆమె వెల్లడించింది. అతనిపై బాధితురాలు ఫిర్యాదు చేయగా.. ప్రస్తుతం మొరానీ బెయిల్‌పై బయటకు వచ్చాడు. చెన్నై ఎక్స్‌ప్రెస్, రా.వన్, హ్యాపీ న్యూ ఇయర్‌లాంటి భారీ సినిమాలకు కరీం మొరానీ నిర్మాతగా వ్యవహరించాడు. మొరానీ కుటుంబం తమకు తెలియడంతో 2014లో తాను ముంబైకి వెళ్లినట్లు ఆ యువతి చెప్పింది. సినిమాల్లో నటించాలన్న ఆశతో తాను అతని దగ్గరికి వెళ్లానని తెలిపింది. ఆ రోజు రాత్రి 7 గంటల సమయంలో మొరానీ వైన్ బాటిల్‌తో ఇంటికి వచ్చాడు. నేను తాగను అన్నా కూడా బలవంతంగా తాగించే ప్రయత్నం చేశాడు. ఆ తర్వాత నాకేమీ గుర్తు లేదు. ఉదయం 4 గంటల సమయంలో మెలుకువ వచ్చి చూడటంతో మొరానీ అక్కడ లేడు. నా ఒంటిపై కొన్ని మరకలు కనిపించాయి.

నేను పూర్తిగా షాక్‌కు గురయ్యాను అని ఆమె వివరించింది. ఆ తర్వాత కూడా ఈ విషయంపై మొరానీని నిలదీస్తే బెదిరింపులకు దిగాడని బాధితురాలు ఆరోపించింది. నీ ఫొటోలు నా దగ్గర ఉన్నాయి. నువ్వు ఎవరికైనా ఈ విషయం చెబితే అండర్‌వరల్డ్ సాయంతో నిన్ను చంపిస్తా అన్నాడు. అతనికి అండర్‌వరల్డ్‌తోనూ సంబంధాలు ఉన్నాయి. తర్వాత కూడా ఇలాగే ఎన్నోసార్లు బెదిరింపులకు పాల్పడ్డాడు అని ఆమె చెప్పింది. ఈ యువతి గతంలోనూ హైదరాబాద్ రాచకొండ పోలీస్ కమిషనరేట్ పరిధిలో మొరానీపై ఫిర్యాదు చేసింది. అప్పట్లో మొరానీపై రేప్ కేసు నమోదైంది. ప్రస్తుతం అతను బెయిల్‌పై ఉన్నాడు.

7338
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles