సీసీఎస్ పోలీస్ స్టేషన్‌లో నిర్మాత దిల్ రాజు

Wed,December 20, 2017 04:31 PM
Producer Dil Raju at ccs police station

హైదరాబాద్: నిర్మాత దిల్ రాజు ఇవాళ సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్‌కు వెళ్లారు. సినిమా పైరసీని అరికట్టాలని సైబర్ క్రైమ్ అదనపు డీసీపీ రఘువీర్‌కు ఆయన ఫిర్యాదు చేశారు. నాని నటించిన ఎంసీఏ సినిమా రేపు రిలీజ్ కానున్న సంగతి తెలిసిందే. ఈ సందర్భంగా ఎంసీఏ సినిమా పైరసీని అరికట్టాలని ఆయన డీసీపీని కోరారు. దీనిపై స్పందించిన డీసీపీ.. ఎంసీఏ సినిమా పైరసీకి గురి కాకుండా అన్ని రకాల చర్యలు తీసుకుంటామని రాజుకు హామీ ఇచ్చారు.

4370
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles