భైరవద్వీపం నిర్మాత ఇకలేరు..

Sun,May 12, 2019 07:05 PM


చెన్నై: విజయా-వాహినీ సంస్థల అధినేత బి.నాగిరెడ్డి కుమారుడు, ప్రముఖ సినీ నిర్మాత వెంకట్రామిరెడ్డి (75)కన్నుమూశారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న వెంకట్రామిరెడ్డి ఇవాళ చెన్నైలో తుదిశ్వాస విడిచారు. ఆయనకు భార్య భారతీ రెడ్డి, ఇద్దరు కుమార్తెలు ఆరాధన, అర్చన, కుమారుడు రాజేశ్ రెడ్డి ఉన్నారు. వెంకట్రామిరెడ్డి అంత్యక్రియలు రేపు ఉదయం 7.30గంటలకు జరగనున్నట్లు ఆయన కుటుంబ సభ్యులు వెల్లడించారు.


సింగీతం శ్రీనివాస్ రావు, బాలకృష్ణ కాంబినేషన్ లో వచ్చిన ఆల్ టైం హిట్ చిత్రం భైరవద్వీపం ను విజయ బ్యానర్ పై వెంకట్రామిరెడ్డి నిర్మించారు. దీంతోపాటు శ్రీకృష్ణార్జున విజయం, బృందావనం సినిమాలను నిర్మించారు.. తమిళంలో విశాల్, ధనుష్ అజిత్, విజయ్ తో సినిమాలను నిర్మించారు.

5036
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles