మ‌జిలీ ‘ప్రియతమా..ప్రియతమా’ సాంగ్ మేకింగ్ వీడియో

Thu,April 4, 2019 12:21 PM
Priyathama Priyathama Song Making video released

వివాహ బంధం త‌ర్వాత నాగ చైతన్య, సమంత తొలిసారి క‌లిసి న‌టించిన చిత్రం మజిలీ. శివనిర్వాణ దర్శకత్వం వహిస్తున్న ఈ చిత్రం నుంచి రెండో పాటగా ‘ప్రియతమా..ప్రియతమా పలికినది హృదయమే సరిగమా..నీ కోసమే రాశానుగా నా కళ్లతో ప్రియలేఖ’ అంటూ సాగే ఈ పాటని విడుద‌ల చేశారు. అద్బుతమైన లిరిక్స్ తో సాగిన ఈ పాట‌ని చిన్మయి శ్రీపాద ఆల‌పించారు. గోపీ సుందర్ కంపోజ్ చేసిన ఈ పాట అందరిని అలరించింది. ఈ పాట లింక్ ను ట్విట్టర్ లో షేర్ చేసిన సమంత..చిన్మయి నీ స్వరంలో మ్యాజిక్ ఉందని ట్వీట్ చేసింది. తాజాగా సాంగ్ విశేషాల‌ని తెలియ‌జేస్తూ షూటింగ్ లొకేష‌న్‌కి సంబంధించిన స‌న్నివేశాల‌ని మేకింగ్ వీడియో ద్వారా విడుద‌ల చేశారు. సినిమాలో ఈ పాట ప్రాధాన్యం చాలా ఉంటుంద‌ని చైతూ అన్నాడు. ఏప్రిల్ 5న విడుద‌ల కానున్న ఈ చిత్రంలో రావు రమేశ్, పోసాని కృష్ణ మురళి, రాజశ్రీ నాయర్ ఇతర పాత్రల్లో నటించారు.

1091
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles