ఆన్‌లైన్‌లో చ‌క్క‌ర్లు కొడుతున్న ప్రియాంక వెడ్డింగ్ కార్డ్

Wed,November 21, 2018 08:16 AM
priyanka wedding card viral in social media

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా డిసెంబ‌ర్‌లో త‌న ప్రియుడు నిక్ జోనాస్‌తో ఏడ‌డ‌గులు వేయ‌నున్న సంగ‌తి తెలిసిందే. జోధ్‌పూర్ ఉమైద్ భ‌వ‌న్ ప్యాలెస్ వేదిక‌గా వీరి వివాహం జ‌ర‌గ‌నుండ‌గా, ఈ ప్యాలెస్ ఒక్క రోజు ఖ‌ర్చు న‌ల‌బై మూడు ల‌క్ష‌లు పై మాటే అని అంటున్నారు. దీపిక పెళ్ళికి సంబంధించిన హ‌డావిడి ముగియ‌డంతో ఇప్పుడు అంద‌రి దృష్టి ప్రియాంక పెళ్ళిపై ఉంది. ఈ నేప‌థ్యంలో ప్రియాంక చోప్రా, నిక్‌ల పెళ్లి పత్రిక బయటికి రావ‌డంతో అభిమానుల‌లో ఆనందం హ‌ద్దులు దాటింది. తమ పెళ్లి పత్రికలో భారతీయులు ఎంతగానో ఇష్టపడే లడ్డూలకు బదులుగా ఫ్రెంచ్‌ మకరూన్స్‌ను అందించనున్నారు ప్రియాంక దంప‌తులు. పెళ్లి డేట్ అధికారికంగా ప్ర‌క‌టించ‌కుండా ఇలా ఫొటోలు రిలీజ్‌ చేయడంతో పెళ్లి ఎక్కడ జరుగుతుందని హాట్‌ టాపిక్‌గా మారింది. జోధ్ పూర్ ప్యాలెస్ లో వీరి వివాహం దేసీ స్టైల్‌లో జ‌ర‌గ‌నుండగా, యూఎస్‌లో క్రిస్టియ‌న్ సంప్ర‌దాయం ప్ర‌కారం జ‌ర‌గ‌నుంది. ఇటీవ‌లే ప్రియాంక బ్యాచిల‌ర్ పార్టీతో బ్రైడ‌ల్ ష‌వ‌ర్ కూడా జ‌రుపుకున్న సంగ‌తి తెలిసిందే. ఈ జంట తమ పెళ్లి ఫొటోల హక్కులను సుమారు 25 లక్షల డాలర్లు (సుమారు రూ.18 కోట్లు)కు అమ్ముకున్నట్లు వార్తలు వస్తున్నాయి. ఈ ఏడాది ఆగ‌స్ట్‌లో నిక్‌, ప్రియాంక‌లు నిశ్చితార్ధం జ‌రుపుకున్న విష‌యం విదిత‌మే.

1535
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles