పెళ్ళి వార్త‌లపై స్పందించిన ప్రియాంక చోప్రా

Sat,July 14, 2018 12:22 PM
priyanka opens on love affair with nick jonas

గ్లోబ‌ల్ భామ ప్రియాంకా చోప్రా కొన్నాళ్ళుగా అమెరికన్ సింగర్ నిక్ జొనాస్‌తో చెట్టాప‌ట్టాలు వేస్తున్న విష‌యం తెలిసిందే . ఎక్కడికెళ్లినా ఇద్దరూ క‌లిసే వెళుతున్నారు . ఓ బేస్‌బాల్ గేమ్‌కు కలిసి వెళ్ళిన వారు వెంటనే లాస్ ఏంజిల్స్‌లోని వెస్ట్ హాలీవుడ్‌లో ఉన్న టోకా మెడెరాలో డిన్నర్ డేట్‌కు వెళ్లారు. ఆ త‌ర్వాత అమెరికాలోని జాన్ ఎఫ్ కెన్నడీ అంతర్జాతీయ విమానాశ్రయంలో మరోసారి కెమెరా కంట ప‌డ్డారు . ఇక ఆ త‌ర్వాత‌ నిక్‌ జోనాస్‌ బంధువు పెళ్లికి వెళ్లింది ప్రియాంక . వేడుక‌లో ఇరువురు చేతులు జోడించి న‌డ‌వ‌గా, పెళ్లిలో నిక్‌ కుటుంబ సభ్యులతో ప్రియాంక చనువుగా ఉండ‌డం చూసి అంద‌రు షాక్ అయ్యారు. ఇక రీసెంట్‌గా నిక్‌ని ముంబైకి తీసుకువ‌చ్చి ఆశ్చ‌ర్య‌ప‌ర‌చింది ప్రియాంక‌. అంద‌రు క‌లిసి విహార యాత్ర‌లో భాగంగా గోవా వెళ్లారు. అక్క‌డ వీరి నిశ్చితార్ధం కూడా జ‌రిగింద‌ని అన్నారు.

అయితే త‌న పెళ్ళిపై వ‌స్తున్న వార్త‌ల‌పై ప్రియాంక చోప్రా ఓ ఇంగ్లీష్ ఛానెల్‌కి ఇచ్చిన ఇంట‌ర్వ్యూలో క్లారిటీ ఇచ్చింది. వివాహ వ్య‌వ‌స్థ‌పై న‌మ్మ‌క‌మున్న నాకు పెళ్లి చేసుకోవ‌డం అంటే ఇష్టం. ఎప్పుడో ఒక రోజు వైవాహిక బంధంలోకి అడుగుపెట్టాల‌ని తెలుసు. కాని అది ఎప్పుడు జ‌రుగుతుంద‌నేది చెప్ప‌లేను అని చెప్పుకొచ్చింది ప్రియాంక‌. ఇక నిక్ ఇటీవ‌ల ఇండియాకి రావ‌డం గురించి మాట్లాడిన ప్రియాంక ఈ ట్రిప్‌లో మేము ఒకరినొక‌రిని తెలుసుకున్నాం. ఇది మాకు చాలా గొప్ప ఎక్స్‌పీరియెన్స్. అత‌నితో టైం స్పెంట్ చేయ‌డం నాకు చాలా ఆనందంగా ఉంటుంది అని పేర్కొంది. మ‌రి ప్రియాంక మాట‌ల‌ని బట్టి చూస్తుంటే త్వ‌ర‌లోనే త‌న‌క‌న్నా 11ఏళ్ల చిన్న‌వాడైన నిక్‌ని వివాహం చేసుకోనుంద‌ని తెలుస్తుంది.

ఇటీవ‌ల వీరిరివురి చేతుల‌కి ఎంగేజ్‌మెంట్ ఉంగరాలు ఉన్న ఫోటోలు సోష‌ల్ మీడియాలో చ‌క్క‌ర్లు కొట్టిన సంగ‌తి తెలిసిందే. రానున్న రోజుల‌లో నిక్ జొనాస్‌, ప్రియాంక చోప్రాలు కలిసి ఓ సినిమా ప్రాజెక్ట్ ను చేయబోతున్నట్టు సమాచారం. త్వరలో ఈ ప్రాజెక్ట్‌కి సంబంధించిన వివరాలు కూడా వెల్ల‌డించ‌నున్నార‌ట‌. హాలీవుడ్‌లో ప‌లు ప్రాజెక్ట్స్‌తో బిజీగా ఉన్న ప్రియాంక త్వ‌ర‌లో కొన్ని బాలీవుడ్ ప్రాజెక్ట్స్ చేయ‌నుంది.

2396
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles