ప్రియాంక-నిక్ ఫ్యామిలీ పిక్ అదుర్స్

Sun,December 9, 2018 08:34 AM
priyanka nick jonas family pick goes viral

బాలీవుడ్ బ్యూటీ ప్రియాంక చోప్రా డిసెంబ‌ర్ 2,3 తేదీల‌లో అమెరిక‌న్ సింగ‌ర్ నిక్ జోనాస్‌ని వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. క్రైస్త‌వ‌, హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం జ‌రిగిన వీరి వివాహ వేడ‌క‌కి కేవ‌లం కుటుంబ స‌భ్యులు మాత్ర‌మే హాజ‌రయ్యారు. అంగ‌రంగ వైభవంగా జ‌రిగిన వీరి పెళ్లి వేడుక‌కి సంబంధించిన ఫోటోల‌ని ఒక్కొక్క‌టిగా విడుద‌ల చేస్తూ అభిమానుల‌లో ఆనందం నింపుతుంది ప్రియాంక . తాజాగా క్రైస్త‌వ సంప్ర‌దాయం ప్ర‌కారం జ‌రిగిన వివాహంలో కుటుంబ స‌భ్యులందరు క‌లిసి గ్రూఫ్ ఫోటో దిగారు. ఇందులో వారు ధ‌రించిన దుస్తుల‌ని ప్రముఖ అమెరికా డిజైనర్‌ రాల్ఫ్‌ లారెన్‌ డిజైన్‌ చేశారు. ఇక హిందూ సంప్రదాయానికి సంబంధించిన దుస్తులను సవ్యసాచి రూపుదిద్దారు.

ప్రియాంక త‌న ఇన్‌స్టాగ్రాంలో గ్రూప్ ఫోటోని షేర్ చేస్తూ.. ‘ఇదే మా కుటుంబం. రాల్ఫ్‌ లారెన్‌కు కృతజ్ఞతలు. వి లవ్‌ యూ! మెరిసిపోయే అభరణాలు అందించిన చోపర్డ్. సంప్రదాయమైన లెహెంగా, జువెలరీ సృష్టించిన సవ్యసాచికి కృతజ్ఞతలు’ అని పేర్కొంది. అంతేకాక డిజైనర్లు సందీప్‌ ఖోస్లా, అబుజానీలకు ఆమెకు కృతజ్ఞతలు తెలిపారు. కుటుంబంతో కలిసి ప్రియాంక దిగిన ఫొటో నెటిజన్లను విపరీతంగా ఆకట్టుకుంటోంది.

3267
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles