మ‌న‌స్థాపంతో న‌టి ప్రియాంక ఆత్మ‌హ‌త్య‌ !

Wed,July 18, 2018 12:04 PM
priyanka commits suicide

టీవీ సీరియ‌ల్స్‌తో పాటు ప‌లు సినిమాల‌లో న‌టించిన ప్రియాంక(33) ఈ రోజు ఆత్మ‌హ‌త్య చేసుకుంది. వ‌ల‌స‌ర‌వ‌క్కంలోని త‌న గృహంలో సీలింగ్‌కి ఉరి వేసుకొని మ‌ర‌ణించింది ప్రియాంక‌. ఇంటికి ప‌ని మ‌నిషి వ‌చ్చి చూడ‌డంతో ప్రియాంక విగ‌త‌జీవిగా క‌నిపించింది. వెంట‌నే ఆమె పోలీసుల‌కి స‌మాచారం అందించింది. న‌టి ఇంటికి చేరుకున్న పోలీసులు ప్రియాంక మ‌ర‌ణానికి గ‌ల కార‌ణాల‌పై ద‌ర్యాప్తు జ‌రుపుతున్నారు. మూడేళ్ళ క్రితం అరుణ్ బాల అనే వ్య‌క్తిని వివాహం చేసుకున్న ఆమె మూడు నెల‌లుగా భ‌ర్త‌కి దూరంగా ఉంటుంది. కుటుంబ‌ క‌ల‌హాల కార‌ణంగానే ప్రియాంక ఆత్మహ‌త్య చేసుకుంద‌ని చెబుతున్నారు. రమ్య‌కృష్ణ ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందిన వంశం అనే సీరియ‌ల్‌తో బాగా ఫేమ‌స్ అయింది ప్రియాంక‌. ఇందులో జోతిక అనే పాత్ర పోషించింది. ఆమె మృతికి త‌మిళ సీరియ‌ల్ ప‌రిశ్ర‌మ సంతాపం వ్య‌క్తం చేసింది. ఈ మ‌ధ్య కాలంలో త‌మ కెరీర్‌తో పాటు ప‌ర్స‌న‌ల్ లైఫ్ ని బ్యాలెన్స్ చేసుకోలేక‌పోతున్న తార‌లు ఎక్కువ మంది ఆత్మ‌హ‌త్య‌లు చేసుకుంటున్నారు. సీరియ‌ల్ స్టార్స్ స‌బ‌ర్న‌, సాయి ప్ర‌శాంత్ ఇటీవ‌లి కాలంలో ఆత్మ‌హ‌త్య చేసుకొని మ‌ర‌ణించిన సంగ‌తి తెలిసిందే.

6227
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS