నాలుగు దేశాల‌లో ప్రియాంక మైన‌పు విగ్ర‌హం ..!

Sun,February 10, 2019 09:56 AM

బాలీవుడ్ నుండి హాలీవుడ్‌కి వెళ్ళిన అందాల భామ ప్రియాంక‌చోప్రా వ‌ర‌ల్డ్ ఫేమ‌స్ అయిన సంగ‌తి తెలిసిందే. ప్రియాంక న‌టించిన హాలీవుడ్ చిత్రం ‘ఈజింట్‌ ఇట్‌ రొమాంటిక్‌’ త్వ‌ర‌లో ప్రేక్ష‌కుల ముందుకు రానుండ‌గా,ఈ సినిమా ప్రమోషన్స్‌ పనుల్లో బిజీగా ఉంది. మ‌రోవైపు హిందీలో ‘ది స్కై ఈజ్‌ పింక్‌’ అనే చిత్రంలో నటిస్తుంది ప్రియాంక‌. అయితే ఈ అమ్మ‌డు న్యూయార్క్‌లోని మేడమ్‌ తుస్సాడ్స్‌ మ్యూజియంలో త‌న మైన‌పు బొమ్మ‌తో రీసెంట్‌గా ఫోటో దిగి షేర్ చేసింది. ఈ ఫోటో సోష‌ల్ మీడియాలో వైర‌ల్ అయింది. ప్రియాంక క్రేజ్‌ని దృష్టిలో ఉంచుకొని ఆమె మైనపు విగ్రహాన్ని తుస్సాడ్స్‌ వారు కేవలం న్యూయార్క్‌లోనే కాదు యూకే, ఆస్ట్రేలియా, ఆసియాలో కూడా ఆవిష్కరించనున్నారట‌. ఇప్ప‌టి వ‌రకు అమెరికన్‌ నటి, గాయని విట్నే ఎలిజబెత్‌ హూస్టన్‌కి సంబంధించి మూడు మైన‌పు విగ్ర‌హాలు ఉండ‌గా, ఇప్పుడు ఆమె రికార్డ్‌ని చెరిపేసింది ప్రియాంక‌. అమెరికన్ గాయ‌కుడు నిక్ జోనాస్‌ని వివాహం చేసుకున్న ప్రియాంక త్వ‌ర‌లో ఆయ‌న‌తో క‌లిసి క్రేజీ ప్రాజెక్ట్ చేయ‌నున్న‌ట్టు స‌మాచారం.

1675
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles