డ‌యాబెటిస్ వ‌ల‌న ప్రియాంక ప్రియుడులో ఎంత తేడా..!

Sun,November 18, 2018 08:40 AM
Priyanka Chopras message to fianc� Nick Jonas is pure love

దేశీ గార్ల్ ప్రియాంక చోప్రా అమెరిక‌న్ సింగ‌ర్ నిక్ జోనాస్‌ని డిసెంబ‌ర్‌లో వివాహం చేసుకోనున్న సంగ‌తి తెలిసిందే. జోథ్‌పూర్ వేదిక‌గా వీరి వివాహం జ‌ర‌గ‌నుంది. ఈ నెలాఖ‌రు నుండి ప్రియాంక‌, నిక్‌ల పెళ్ళి హ‌డావిడి మొద‌లు కానుంది. అయితే తాజాగా ప్రియాంక ప్రియుడు నిక్ జోనాస్ ఇన్‌స్టాగ్రామ్‌లో పెట్టిన పోస్ట్ హాట్ టాపిక్‌గా మారింది. త‌ను 13 ఏళ్ల క్రితం టైప్‌ 1 డయాబెటిస్ షుగర్‌ వ్యాధితో బాధపడుతున్నట్టు డాక్టర్లు నిర్ధారించారట. ఆ విష‌యాన్ని అభిమానుల‌తో తెలియ‌జేస్తూ అప్ప‌టి, ఇప్ప‌టి ఫోటోని షేర్ చేశాడు. చికిత్స జరిగిన కొన్ని వారాల తర్వాత ఫొటో ఇది. శరీరంలో షుగర్‌ మోతాదు ఎక్కువ ఉండటంతో సుమారు 100 పౌండ్లు బరువు కూడా లేను అప్పుడు. కాని ఇప్పుడు చాలా హెల్తీగా ఉన్నాను. ఆరోగ్య‌క‌ర‌మైన ఆహారం తీసుకోవ‌డం, క్ర‌మం త‌ప్ప‌కుండా వ్యాయామం చేయ‌డం, రక్తంలో షుగుర్‌ లెవల్స్‌ కరెక్ట్‌గా ఉన్నాయో లేదో చూసుకోవడం నా లైఫ్‌స్టైల్‌లో భాగం అయిపోయింది అని పోస్ట్‌లో తెలిపాడు నిక్ జోనాస్.

డ‌యోబెటిస్ ఉన్న‌ప్ప‌టికి నా ఆరోగ్యాన్ని ఎప్పుడు కంట్రోల్‌లో ఉంచుకున్నాను. ఆ స‌మ‌యంలో నాకు స‌హ‌క‌రించిన కుటుంబ స‌భ్యుల‌కి, స్నేహ‌తుల‌కి ధ‌న్య‌వాదాలు. స‌క్ర‌మంగా జీవించ‌నివ్వ‌ని దానిని మ‌న ద‌రి చేరనివ్వ‌కుండా త‌గు జాగ్ర‌త్తలు తీసుకోండి. నా అభిమానుల ప్రేమ‌,సపోర్ట్‌కి ఎల్ల‌ప్పుడు రుణ‌ప‌డి ఉంటాను అంటూ నిక్ ఎమోష‌న‌ల్ పోస్ట్ పెట్టాడు. దీనికి ప్రియాంక చోప్రా .. ‘‘నీకు సంబంధించిన ప్రతీది నాకు స్పెషలే. డయాబెటీస్‌ ఉన్నా లేకపోయినా’’ అంటూ ముద్దు స్మైలీతో కామెంట్‌ చేశారు. వీరిద్ద‌రి సంభాష‌ణకి సంబంధించిన పోస్ట్ ప్ర‌స్తుతం వైర‌ల్‌గా మారింది.


View this post on Instagram

13 years ago today I was diagnosed with type 1 diabetes. The picture on the left is me a few weeks after my diagnosis. Barely 100 pounds after having lost so much weight from my blood sugar being so high before going to the doctor where I would find out I was diabetic. On the right is me now. Happy and healthy. Prioritizing my physical health, working out and eating healthy and keeping my blood sugar in check. I have full control of my day to day life with this disease, and I’m so grateful to my family and loved ones who have helped me every step of the way. Never let anything hold you back from living your best life. Thank you to all my fans for your kind words and support. Means more than you know. Love you all. #grateful #diabetes #livebeyond #fbf

A post shared by Nick Jonas (@nickjonas) on


5436
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

target delhi
country oven

Featured Articles

Health Articles