నడాల్ మ్యాచ్ చూసిన ప్రియాంకా చోప్రా

Wed,September 5, 2018 05:11 PM
Priyanka Chopra watches Nadal match at US Open

న్యూయార్క్: డిఫెండింగ్ చాంపియన్ రాఫేల్ నడాల్.. అతికష్టమ్మీద యూఎస్ ఓపెన్‌లో సెమీస్‌కు వెళ్లాడు. ఇవాళ జరిగిన మ్యాచ్‌లో అతను డామినిక్ థీమ్‌పై అయిదు సెట్ల పోరులో గెలిచాడు. హోరాహోరీగా సాగిన మ్యాచ్‌లో నడాల్ 0-6, 6-4, 7-5, 6-7, 7-6 స్కోర్‌తో థీమ్‌పై విక్టరీ సాధించారు. ఈ ఏడాది యూఎస్ ఓపెన్‌లో ఇదే అత్యంత సుదీర్ఘంగా సాగిన మ్యాచ్. అయితే ఈ మ్యాచ్‌ను బాలీవుడ్ నటి ప్రియాంకా చోప్రా.. తన కాబోయే భర్త నిక్ జోనస్‌తో కలిసి చూసింది. ఇటీవల నిశ్చితార్థం చేసుకున్న ప్రియాంకా.. న్యూయార్క్‌లోని ఆర్థర్ ఆషే స్టేడియంకు వెళ్లింది. అక్కడ క్వార్టర్స్ పోరును నిక్‌తో కలిసి ఆసక్తికరంగా తిలకించింది. కొన్ని రోజుల క్రితం మెక్సికోలో కనిపించిన.. ప్రియాంకా ఇప్పుడు టెన్నిస్ మ్యాచ్‌లు తిలకిస్తూ డేటింగ్‌ను ఎంజాయ్ చేస్తోంది. నడాల్ సెమీస్‌లో డెల్ పోట్రోతో తలపడనున్నాడు.2159
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles