రోహింగ్యా ముస్లింల క్యాంపులో ప్రియాంక చోప్రా

Mon,May 21, 2018 01:50 PM
Priyanka Chopra visits Rohingya refugee camps in Bangladesh

ఢాకా: సరిహద్దు దేశం మయన్మార్‌లోని రఖైన్ రాష్ట్రం నుంచి ప్రాణాలు అరచేత పట్టుకొని రోహింగ్యా ముస్లింలు బంగ్లాదేశ్‌కు వలస వచ్చిన విషయం తెలిసిందే. తాజాగా రోహింగ్యా శరణార్థులు ఆశ్రయం పొందుతున్న క్యాంపును బాలీవుడ్ నటి, యునిసెఫ్ బాలల హక్కుల అంబాసిడర్‌గా వ్యవహరిస్తున్న బాలీవుడ్ నటి ప్రియాంక చోప్రా సందర్శించారు.

హాలివుడ్ స్నేహితురాలు మేఘన్ మెర్కెల్, బ్రిటన్ రాకుమారుడు ప్రిన్స్ హ్యారీ వివాహ వేడుకలో పాల్గొన్న ఆమె నేరుగా లండన్ నుంచి బంగ్లాదేశ్ రాజధాని ఢాకా వెళ్లారు. ఈ సందర్భంగా తన ట్విటర్ ద్వారా ఓ సందేశాన్ని ఇచ్చారు. యునిసెఫ్ ఫీల్డ్ సందర్శనలో భాగంగా రోహింగ్యా శరణార్థుల క్యాంపును సందర్శిస్తాను. బాలలకు ఆశ్రయమిచ్చి వారిని ఆదుకోవాలి. వారిపై ప్రపంచం శ్రద్ధ చూపించడం అవసరం. మనము కూడా వారిపై శ్రద్ధ పెట్టాల్సిన అవసరం ఎంతైనా ఉందని ఆమె ట్వీట్ చేశారు.

2803
Follow us on : Facebook | Twitter
Namasthe Telangana Property Show

More News

VIRAL NEWS