ప్రియాంకా చోప్రాకు మెయిల్ పంపించకండి.. ఎందుకంటే?

Thu,December 7, 2017 05:23 PM
ప్రియాంకా చోప్రాకు మెయిల్ పంపించకండి.. ఎందుకంటే?

బాలీవుడ్ స్టార్ ప్రియాంకా చోప్రాకు ఈమెయిల్ పంపడం లాంటివి ఏమన్నా ప్లాన్ చేసుకుంటే ఇప్పుడే మానుకోండి. ఎందుకంటే.. మీరు ఎంతో కష్టపడి, ఇష్టపడి తనకు మెయిల్ చేసినా.. ప్రియాంక చూసుకోదు. ఇప్పటికే 2 లక్షల 57 వేల 623 అన్‌రీడ్ మెయిల్స్ తన మెయిల్‌లో ఉన్నాయట. వాటినే ఇంతవరకు ఓపెన్ చేయలేదట. ఇక.. మీరు పంపించిన మెయిల్‌ను ఎక్కడ చదువుతుంది చెప్పండి. ఈవిషయాన్ని ప్రియాంక కోస్టార్ అలన్ పోవెల్ తన ట్విట్టర్, ఇన్‌స్టాగ్రామ్ ఖాతాలో ప్రియాంక ఫోన్ స్క్రీన్ షాట్‌ను షేర్ చేసి మరీ వివరించాడు.

A post shared by Alan Powell (@alanpowell10) on


ప్రియాంక ప్రస్తుతం ఓ అమెరికన్ సిరీస్‌లో నటిస్తున్న సంగతి తెలిసిందే. ఆ సిరీస్‌లో తనతో పాటు నటిస్తున్న వ్యక్తే అలన్ పోవెల్. ప్రియాంక మొబైల్ స్క్రీన్‌పై ఉన్న అన్‌రీడ్ మెయిల్స్ సంఖ్యను చూసి షాక్ తిని ఇలా సోషల్ మీడియాలో షేర్ చేశాడట. అయితే... ఈ ఫోటోను నెటిజన్లు సోషల్ మీడియాలో వైరల్ చేయడమే కాదు.. తమ మెయిల్‌లో ఉన్న అన్‌రీడ్ మెయిల్స్ సంఖ్యను కూడా స్క్రీన్ షాట్ తీసి తెగ షేర్ చేస్తున్నారు.

"గాయ్స్.. ప్రియాంకా చోప్రాకు ఎప్పుడూ మెయిల్ చేయకండి.. అమె అసలు ఆ మెయిల్‌ను చదవదు.. ఇదో రికార్డు... ఈమె రికార్డును ఎవ్వరూ బీట్ చేయలేదు.." అంటూ అలన్ ట్వీట్ చేశాడు.

2984

More News

VIRAL NEWS