క‌ల్ప‌నా చావ్లా బ‌యోపిక్‌లో ప్రియాంక చోప్రా..!

Sat,March 17, 2018 01:01 PM
Priyanka Chopra to play Kalpana Chawla in her next

అంతరిక్షయానం చేసిన తొలి భారతీయ మరియు ఇండో-అమెరికన్ మహిళ వ్యోమగామిగా చరిత్ర సృష్టించిన మ‌హిళ‌ కల్పనా చావ్లా. కొలంబియా స్పేస్ షటిల్ ప్రమాదంలో 2003 ఫిబ్రవరి 1 న ఆమె క‌న్నుమూసింది. అంతరిక్షం నుంచి తిరిగివస్తూ కొలంబియా నౌక ప్రమాదానికి గురికావడంతో అమెతోపాటు మరో ఆరుగురు వ్యోమగాములు ప్రాణాలు కోల్పోయారు. కల్పనా చావ్లా 1962 మార్చి 17 న హరియాణాలోని కర్నాల్‌లో ఓ సాధారణ మధ్యతరగతి కుటుంబంలో జన్మించింది. లింగ వివ‌క్ష‌త‌ను అధిగ‌మించి త‌ల్లి స‌హాకారంతో ఆమె క‌ల‌ని నిజం చేసుకున్న క‌ల్ప‌నా చావ్లా బ‌యోపిక్ వ‌చ్చే నెల‌లో రూపొందనున్న‌ట్టు తెలుస్తుంది.

గ్లోబ‌ల్ గార్ల్ ప్రియాంక చోప్రా ప్ర‌ధాన పాత్ర‌లో క‌ల్ప‌నా చావ్లా బ‌యోపిక్‌ని తెర‌కెక్కించేందుకు డెబ్యూ డైరెక్ట‌ర్ ప్రియా మిశ్రా ఏర్పాట్లు చేసుకుంటున్నట్టు బాలీవుడ్ టాక్‌. దాదాపు ఏడెళ్ళ నుండి ఈ ప్రాజెక్ట్‌పైనే వ‌ర్క్ చేసిన ద‌ర్శ‌కురాలు వీలైనంత త్వ‌ర‌లోనే మూవీని సెట్స్ పైకి తీసుకెళ్ళాల‌ని భావిస్తున్నారు. జెట్‌వే అనే ప్రొడ‌క్ష‌న్ కంపెనీ ఈ చిత్రాన్ని నిర్మించ‌నున్న‌ట్టు స‌మాచారం. హాలీవుడ్ సినిమాల‌తో పాటు క్వాంటికో అనే సీరియ‌ల్‌తో ఇంట‌ర్నేష‌న‌ల్ క్రేజ్ సంపాదించుకున్న ప్రియాంక చోప్రా అయితేనే క‌ల్ప‌నా పాత్ర‌కి బాగుంటుంద‌ని టీం భావిస్తుంద‌ట‌. ఇంట‌ర్నేష‌న‌ల్ రేంజ్‌లో ఈ మూవీని తెర‌కెక్కించాల‌ని టీం ప్లాన్. త్వ‌ర‌లోనే దీనిపై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న రానుంది. ప్రియాంక ప్ర‌స్తుతం హాలీవుడ్‌లో క్వాంటికో 3 సీరియల్‌తో పాటు ఈజ్ నాట్ ఇట్ రొమాంటిక్, ‘ఎ కిడ్ లైక్ జేక్’ అనే హాలీవుడ్ చిత్రాలు చేస్తుంది.

971
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles