ఐదు నిమిషాల డ్యాన్స్‌కు ఐదు కోట్లు!

Fri,December 15, 2017 01:46 PM
ఐదు నిమిషాల డ్యాన్స్‌కు ఐదు కోట్లు!

దేశీ గర్ల్ ఇమేజ్ నుంచి గ్లోబల్ స్టార్‌గా ఎదిగిన బాలీవుడ్ బ్యూటీ ప్రియాంకా చోప్రా రేంజ్ ఎక్కడికో వెళ్లిపోయింది. ఈ మధ్య బాలీవుడ్‌కు పూర్తిగా గుడ్ బై చెప్పేసి హాలీవుడ్, ఇంటర్నేషనల్ అవార్డుల ఫంక్షన్లపైనే దృష్టిసారించిన పీసీ.. రెండేళ్ల తర్వాత ఓ అవార్డుల ఫంక్షన్‌లో బాలీవుడ్ ట్యూన్స్‌కు స్టెప్పులేయనున్నది. ఇంతవరకు బాగానే ఉందిగానీ.. ఆమె ఇచ్చే ఐదు నిమిషాల పర్ఫార్మెన్స్‌కు రూ.4 నుంచి 5 కోట్లు డిమాండ్ చేస్తున్నది. ఆమె గ్లోబల్ ఇమేజ్, ఇంటర్నేషనల్ మీడియాలో ఆమెకున్న ఫాలోయింగ్ వల్ల ఈ అవార్డుల సెర్మనీ నిర్వహిస్తున్న జీ మీడియా.. ఆమె అడిగినంత ఇవ్వడానికి సై అన్నది. ఈ నెల 19న జరగబోయే జీ సినీ అవార్డ్స్‌లో ప్రియాంకా డ్యాన్స్ పర్ఫార్మెన్స్‌తో అదరగొట్టనున్నది. ఇది కేవలం ఐదు నిమిషాల ప్రదర్శనే అయినా.. ఆమెకున్న డిమాండ్‌ను దృష్టిలో ఉంచుకొని.. ఆర్గనైజర్లు పెద్దగా బేరసారాలు లేకుండానే ఓకే చెప్పేశారని పీసీ సన్నిహితులు తెలిపారు. రెండేళ్ల తర్వాత ఇండియాలో పర్ఫార్మెన్స్ ఇవ్వనుండటంతో ఈవెంట్ మొత్తానికీ ప్రియాంకానే స్పెషల్ అట్రాక్షన్‌గా నిలవనున్నది. ఈ మధ్యే న్యూయార్క్‌లో జరిగిన ఐఫా 2016 అవార్డుల ఫంక్షన్‌లోనూ ప్రియాంకాతో పర్ఫార్మెన్స్ ఇప్పించాలని ఆర్గనైజర్లు భావించినా.. ఆమె డిమాండ్ చేసిన మొత్తానికి కళ్లు తిరిగి వద్దనుకున్నారు. ఇప్పుడు జీ సినీ అవార్డ్స్‌లో భాగంగా పీసీతోపాటు షాహిద్ కపూర్, జాక్వెలిన్ కూడా పర్ఫార్మెన్స్ ఇవ్వనున్నారు.

4556
data-page-url = "https://www.ntnews.com/about-us.aspx">

More News

VIRAL NEWS