సోష‌ల్ మీడియాలో ప్రియాంకని టార్గెట్ చేసిన నెటిజ‌న్స్

Thu,September 14, 2017 05:03 PM
Priyanka Chopra sensational comments on sikkim state

బాలీవుడ్ నుండి హాలీవుడ్‌కి వెళ్ళిన దేశీ భామ ప్రియాంక చోప్రా ఈ మ‌ధ్య ప‌లు వివాదాల‌తో హాట్ టాపిక్‌గా మారుతుంది. తాజాగా ఈ అమ్మ‌డు అంతర్జాతీయ ఫిల్మ్‌ ఫెస్టివల్‌ వేదికగా సిక్కిం రాష్ట్రం ఎప్పుడు అల్ల‌ర్లతో అట్టడుకుతుంది అనేలా కామెంట్స్ చేసింది. దీనిపై సిక్కిం రాష్ట్రానికి చెందిన ప్ర‌జ‌లు ట్విట్ట‌ర్‌లో ప్రియాంక‌పై ఫైర్ అవుతూ ప‌లు కామెంట్స్ చేస్తున్నారు. సిక్కిం గురించి ఆమెకు ఏం తెలుసు, ఇండియా మ్యాప్‌లో సిక్కిం ఎక్క‌డుంటుందో ఆమెకి తెలుసా అంటూ త‌మ‌దైన స్టైల్‌లో విమ‌ర్శ‌ల‌కు దిగుతున్నారు. అస‌లు ప్రియాంక చేసిన కామెంట్స్ ఏంటని అంటే.. సిక్కిం అనేది ఈశాన్య భార‌తంలో చిన్న రాష్ట్రం, అక్క‌డ సినిమాలు తీయాలంటే చాలా క‌ష్టం, ఎప్పుడు తిరుగుబాటు, అల్ల‌ర్ల‌తో ఆ రాష్ట్రం అల్ల‌క‌ల్లోలంగా ఉంటుంది. కాని మేము మాత్రంచాలా రిస్క్ చేసి పహునా అనే చిత్రాన్ని నిర్మించాం. ఈ ప్రాంతం నుండి వచ్చిన తొలి చిత్రం పహునానే అంటూ కామెంట్ చేసింది.

ప‌హూనా చిత్రం ప్రియాంక చోప్రా నిర్మాణంలో రూపొంద‌గా, ఈ మూవీ సిక్కిం నుండి వేరే ప్రాంతానికి వ‌ల‌స వెళుతున్న క్ర‌మంలో ఇద్ద‌రు శ‌ర‌ణార్ధుల మ‌ధ్య చోటు చేసుకున్న ఉద్వేగ ప‌రిణామాల‌ని బేస్ చేసుకొని సినిమా తెర‌కెక్కించారు. ఈ క్ర‌మంలో త‌న సినిమాకి ప్ర‌మోష‌న్‌గా ఇంట‌ర్వ్యూ ఇస్తూ సిక్కిం గురించి ప‌లు కామెంట్స్ చేసింది. దీంతో సోష‌ల్ మీడియాలో ప్రియాంక చోప్రాపై తీవ్రంగా మండిప‌డుతున్నారు. అయితే సిక్కిం నుండి చాలా మంచి సినిమాలు వ‌చ్చాయ‌ని, అందులో ప్ర‌శాంత్ ర‌స‌యిలి లాంటి టాలెంట్ ద‌ర్శ‌కుడు తీసిన క‌థ‌, ఆచార్య చిత్రాలు కూడా ఉన్నాయ‌ని నెటిజ‌న్స్ తెలిపారు. ఈ సంవ‌త్స‌రం సిక్కిం స్టేట్ నుండి వ‌చ్చిన ధోక్బు కూడా అనేక అంత‌ర్జాతీయ వేదిక‌పై ప్ర‌శంస‌లు అందుకుంద‌ని వారు తెలిపారు.

అయితే త‌న కామెంట్స్‌తో హ‌ర్ట్ అయిన సిక్కిం రాష్ట్ర ప్ర‌జ‌ల‌కు ప్రియాంక‌చోప్రా క్షమాప‌ణలు చెప్పిన‌ట్టు తెలుస్తుంది. ప్రియాంక తల్లి మ‌ధు చోప్రా సిక్కిం టూరిజం మినిస్ట‌ర్‌కి కాల్ చేసి అపాల‌జీ కోరింద‌ని, త‌న కామెంట్స్‌ని టూరిజం మినిస్ట‌ర్ ఓ ఛానెల్ ద్వారా ప్ర‌జ‌ల‌కు చేర‌వేశాడ‌ని వార్తలు వ‌స్తున్నాయి. ఈ వివాదంకి సంబంధించి పూర్తి క్లారిటీ రావ‌ల‌సి ఉంది.

1313
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS