త‌న భ‌ర్త ఇచ్చిన గిఫ్ట్‌కి తెగ మురిసిపోయిన ప్రియాంక చోప్రా

Thu,March 14, 2019 08:36 AM

బాలీవుడ్ నుండి హాలీవుడ్‌కి వెళ్లిన అందాల భామ ప్రియాంక చోప్రా త‌న భ‌ర్త ఇచ్చిన గిఫ్ట్‌ని చూసి తెగ మురిసిపోయింది. త‌న భ‌ర్త ఇచ్చిన గిఫ్ట్‌ని ఇన్‌స్ట్రాగ్రామ్‌లో పోస్ట్ చేస్తూ.. త‌న భ‌ర్త ఉత్త‌మ భ‌ర్త అని చెబుతూ ఐల‌వ్ యూ బేబీ అనే కామెంట్ పెట్టింది. వివ‌రాల‌లోకి వెళితే ఇటీవ‌ల నిక్ జోనాస్ బ్ర‌ద‌ర్ సుకర్ రూపొందించిన వీడియో సాంగ్‌లో నిక్ జోనాస్, ప్రియాంక చోప్రా క‌లిసి ఆడిపాడిన సంగ‌తి తెలిసిందే. జోనాస్ బ్ర‌ద‌ర్స్( జో, కెవిన్‌, నిక్‌) వారి వైఫ్స్( సోఫీ, డానియెల్‌, ప్రియాంక‌) కాంబినేష‌న్‌లో రూపొందిన ఆల్బ‌మ్ అభిమానుల‌ని ఎంత‌గానో అల‌రించింది. అపూర్వ ఆద‌ర‌ణ ఈ వీడియోకి రావ‌డంతో నిక్ జోనాస్ తన స‌తీమ‌ణి ప్రియాంక చోప్రాకి రూ.2.7 కోట్లతో మేబాచ్ మెర్సిడెస్ బెంజ్ లగ్జరీ కారును కొని దాన్ని బహుమతిగా ఇచ్చారు. ఈ కారుతో పాటు వారిద్ద‌రు క‌లిసి దిగిన ఫోటోల‌ని ప్రియాంక చోప్రా సోష‌ల్ మీడియాలో షేర్ చేయ‌డంతో అవి వైర‌ల్ అయ్యాయి. ప్రియాంక న‌టించిన ‘ఇజింట్‌ ఇట్‌ రొమాంటిక్‌’ అనే హాలీవుడ్ చిత్రం ఇటీవ‌ల విడుద‌ల కాగా, ఈ చిత్రం బాక్సాఫీస్ ద‌గ్గ‌ర మంచి విజ‌యం సాధించింది . ఇక ఆమె న‌టిస్తున్న‌ ‘ది స్కై ఈజ్‌ పింక్‌’ అనే బాలీవుడ్ చిత్రం అక్టోబ‌ర్ 11,2019న ప్రేక్ష‌కుల ముందుకు రానుంది.


2952
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles