ఆస్త‌మాతో బాధ‌ప‌డుతున్న ప్రియాంక‌

Tue,September 18, 2018 01:59 PM
Priyanka Chopra reveals asthma

సినీ సెల‌బ్రిటీలు వెండితెర‌పై చాలా గొప్ప‌గా క‌నిపిస్తారు. కాని వారి జీవితంలో ఎన్నో బాధ‌లు, ఎన్నో క‌ష్ట న‌ష్టాలు ఉంటాయని గ్ర‌హించ‌డం చాలా త‌క్కువ‌. కొన్ని సార్లు కొంత మంది సెలబ్రిటీలు ఓపెన్‌గా త‌మ మ‌న‌సులోని బాధ‌ని బ‌య‌ట‌కు వెళ్ళ‌గ‌క్కుతుంటారు. ఇది విని మ‌న‌క‌ళ్ళు చెమ‌ర్చ‌డం ఖాయం. గ్లోబ‌ల్ స్టార్‌గా ఓ వెలుగు వెలుగుతున్న ప్రియాంక చోప్రా ఐదేళ్ళ వ‌య‌స్సు నుండే ఆస్త‌మా నుండి బాధ‌ప‌డుతుంద‌ట‌. ఈ విష‌యాన్ని సిప్లా కంపెనీకి చెందిన ఇన్హేలర్లకు ప్ర‌చార‌క‌ర్త‌గా వ్య‌వ‌హ‌రిస్తున్న క్ర‌మంలో చెప్పుకొచ్చింది.

నాకు ఆస్త‌మా ఉంద‌నే విష‌యం ద‌గ్గ‌ర‌గా ఉన్న చాలా మందికి తెలుసు. ఐదేళ్ళ నుండి ఈ వ్యాధితో బాధ‌ప‌డుతున్నాను. మా అమ్మ డాక్ట‌ర్ కాబ‌ట్టి ఇన్హేల‌ర్‌ని సూచించింది. ఇది వాడ‌టం మొద‌లు పెడితే అది ఒక అల‌వాటుగా మారుతుంద‌ని అంద‌రు చెప్పారు. కాని అలాంటిదేమి లేదు. దాని వ‌ల‌న స్వేచ్చ‌గా ఊపిరి పీల్చుకోవ‌చ్చు. ఆస్త‌మా న‌న్ను అదుపు చేసే లోపు దానిని నేను అదుపు చేయాల‌ని అనుకున్నాను. నా వ‌ద్ద ఇన్హేల‌ర్ ఉన్నంత వ‌ర‌కు ఆస్త‌మా నన్ను ఎద‌గ‌నివ్వ‌కుండా ఆప‌లేదు అని సోష‌ల్ మీడియా ద్వారా తెలిపింది ప్రియాంక. ఇన్హేల‌ర్ వ‌ల‌న ఎలాంటి స‌మ‌స్య‌లు తలెత్త‌వు. ఇది ఆస్త‌మాని కంప్లీట్‌గా త‌గ్గించ‌క‌పోయిన‌,శ్వాస తీసుకోవ‌డంలో దోహ‌ద‌ప‌డుతుంద‌ని వీడియో ద్వారా ప్రియాంక చెప్పుకొచ్చింది. ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో ‘ది స్కై ఈజ్‌ పింక్‌’ చిత్రంలో నటిస్తుంది ప్రియాంక‌. ఇందులో ఫర్హాన్‌ అక్తర్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇక త‌న బాయ్ ఫ్రెండ్‌ నిక్‌ జొనాస్‌ని నవంబర్‌లో లాస్‌ ఏంజెల్స్‌లో వివాహం చేసుకోనుంది ప్రియాంక‌.


5137
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles