ఉద్యోగినుల కోసం సంచలన నిర్ణయం తీసుకున్న ప్రియాంక

Wed,July 18, 2018 04:55 PM
Priyanka Chopra  New Plans For Working Mothers In Her Production House

గ్లోబల్‌ భామ ప్రియాంక చోప్రా తన బర్త్ డే రోజు సొంత నిర్మాణ సంస్థ ‘పర్పుల్‌ పెబ్బెల్‌ ప్రొడక్షన్స్’లో పనిచేస్తున్న ఉద్యోగినులకి బంపర్ ఆఫర్ ఇచ్చింది. తన కంపెనీలో పని చేసే మహిళా ఉద్యోగినులలో ఎక్కువ మంది వివాహితులే ఉండడంతో వారికి అనుకూలంగా ఉండేలా కొన్ని మార్పులు చేసింది. మహిళల ఆలోచనలు, అభిప్రాయాలకి విలువనివ్వాలి కాబట్టి వారి పనివేళలలో మార్పులు చేశాం. 12 వారాల పాటు ప్రసూతి సెలవులు ఇచ్చి , ఆ దినాలలో నగదు సాయం చేస్తాం అని ప్రియాంక తల్లి, మేనేజర్ మధు చోప్రా తెలిపారు. మగవారి పట్ల కూడా మేం సానుకూలంగానే ఉన్నాం. ఇటీవల మా కంపెనీలో పని చేస్తున్న మార్కెటింగ్ ఎగ్జిక్యూటివ్ కి పెటర్నిటీ లీవు కింద నాలుగు వారాల పాటు సెలవు ఇచ్చాం . ఈ నిర్ణయం పూర్తిగా ప్రియాంకదే అని తెలిపారు మధు చోప్రా. ఈ రోజు తన బర్త్‌డే ని లండన్ లో నిక్ జోనాస్ తో జరుపుకుంటుంది ప్రియాంక. ప్రస్తుతం హాలీవుడ్ లో ‘ఎ కిడ్‌ లైక్‌ జేక్’ , ‘ఇజింట్‌ ఇట్‌ రొమాంటిక్’ అనే హాలీవుడ్‌ చిత్రంలో నటిస్తున్నారు. వీటితో పాటు క్వాంటికో అనే సీరియల్ కూడా చేస్తుంది. త్వరలో భారత్ అనే బాలీవుడ్ సినిమాలో సల్మాన్ సరసన నటించనుంది ప్రియాంక చోప్రా.

2766
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS