పెళ్ళికి ఏ కానుక‌లు ఇవ్వాలో ముందే లిస్ట్‌ ఇచ్చిన‌ ప్రియాంక‌

Thu,November 22, 2018 09:58 AM
Priyanka Chopra list huge high

దీపికా ప‌దుకొణే, ర‌ణ్‌వీర్ సింగ్‌ల పెళ్లికి సంబంధించిన హ్యాంగ్ ఓవ‌ర్ దిగ‌క‌ముందే మ‌రో కొత్త జంట ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్‌ల పెళ్లి వేడుక‌ల‌కి సంబంధించిన వార్త‌లు అభిమానుల‌లో నూత‌నుత్తేజాన్ని క‌లిగిస్తున్నాయి. జోధ్‌పూర్ ప్యాలెస్‌లో ప్రియాంక‌, నిక్‌ల వివాహం డిసెంబ‌ర్ 3న అంగ‌రంగ వైభవంగా జ‌ర‌గ‌నుండ‌గా, ఈ నెల‌ఖ‌రు నుండి పెళ్లి హంగామా మొద‌లు కానుంది. అయితే త‌న పెళ్లికి వ‌చ్చే అతిధులు తాను సూచించిన జాబితాలోని కానుక‌ల‌ని ఇవ్వాలంటూ , అలా ఇస్తే తాను సంతోషిస్తాన‌ని ప్రియాంక అంది. ఈ సంప్ర‌దాయం మ‌న‌కి కొత్త‌గా అనిపించిన‌, పాశ్యాత్య దేశాల‌లో ఎప్ప‌టి నుండో ఉంది.

ప్రియాంక చోప్రా ప్ర‌స్తుతం యూనిసెఫ్‌కి ప్ర‌చార క‌ర్తగా వ్య‌వ‌హ‌రిస్తుంది. ఈ క్ర‌మంలో తాను అమెజాన్‌తో ఓ డీల్ కుదుర్చుకొని తాను రిజిస్ట్రీ చేసిన వ‌స్తువుల‌ని అమెజాన్‌లో కొనాల‌ని కోరింది. అమెజాన్ ద్వారా వ‌చ్చిన ఆదాయంలో కొంత భాగాన్ని ఆ సంస్థ యూనిసెఫ్‌కి విరాళంగా ఇవ్వ‌నుందట‌. ఓ మంచి ప‌ని కోసం ప్రియాంక ఇలా చేస్తున్న‌ప్ప‌టికి, మ‌నోళ్ళ‌కి ఇది కాస్త కొత్త‌గా అనిపిస్తుంది. ప్రియాంక తాను కావాల‌నుకుంటున్న వ‌స్తువుల జాబితాలో కిచెన్‌లోకి అవసరమైన చెంచాలు, ఫోర్కులు, డిన్నర్‌ ప్లేట్లు, వైను గ్లాస్‌లు మొదలుకొని డంబెల్స్‌ లాంటి వ్యాయామ సామగ్రి, ట్రావెల్‌ బ్యాగులు, పరుపులు, తలగడలు, టూత్‌ బ్రష్‌ల్లాంటివి ఉన్నాయి. సుమారు రూ.1.70 లక్షల విలువైన ఓఎల్‌ఈడీ టీవీని కూడా కానుకగా ఇవ్వొచ్చట. ప్రియాంకకు తన పెంపుడు కుక్క డయానా అంటే చాలా ఇష్టం. దాని కోసం గులాబీ రంగు నెక్‌ కాలర్‌, రెయిన్‌ కోట్‌, పెట్‌ బెడ్‌, పెట్‌ జీపీఎస్‌ ట్రాకర్‌లను కూడా కానుకలుగా తీసుకురావొచ్చని జాబితాలో పేర్కొంది.

2066
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles