నిక్‌కు పబ్లిక్‌గా కిస్ ఇచ్చిన ప్రియాంకా - వీడియో

Mon,September 17, 2018 02:07 PM
Priyanka Chopra kisses fiance Nick Jonas at his birthday celebrations

లాస్ ఏంజిల్స్: బాలీవుడ్ స్టార్ ప్రియాంకా చోప్రా.. తన బాయ్‌ఫ్రెండ్, కాబోయే భర్త నిక్ జోనస్‌కు పబ్లిక్‌గానే కిస్ ఇచ్చింది. ఈ స్టంట్ లాస్ ఏంజిల్స్‌లోని బేస్‌బాల్ స్టేడియంలో జరిగింది. నిక్ జోనస్ ఆదివారం 26వ పుట్టిన రోజు జరుపుకున్నాడు. స్టేడియంలో జరిగిన ఆ బర్త్‌డే ఈవెంట్‌కు ప్రియాంకా కూడా హాజరైంది. బర్త్‌డే కేక్ కోసిన తర్వాత నిక్ జోనస్.. అందర్నీ కలిశాడు. అయితే స్టేజ్ మీదున్న ప్రియాంకా కూడా తన బాయ్‌ఫ్రెండ్ నిక్‌కు బర్త్‌డే విషెస్ చెప్పింది. చాలా సిగ్గుపడుతూ నిక్ పెదవులపై ప్రియాంకా లిప్ కిస్ ఇచ్చింది. ఇటీవల ముంబైలో ప్రియాంకా నిక్‌లు రోకా సెర్మనీ జరుపుకున్నారు. ఆ టైమ్‌లో రెండు ఫ్యామిలీలు చాలా క్లోజ్ అయ్యాయి. వచ్చే ఏడాది అమెరికాలోనే నిక్‌ను పెళ్లి చేసుకోనున్నట్లు ప్రియాంకా ఈమధ్యే వెల్లడించింది. ఆ ఇద్దరూ కొన్ని నెలల క్రితం లండన్‌లో ఎంగేజ్‌మెంట్ చేసుకున్న విషయం తెలిసిందే.

4754
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles