ఎంగేజ్‌మెంట్ రింగ్‌ ధ‌ర ఎంతో తెలిస్తే నోరెళ్ళ‌పెట్టాల్సిందే..!

Thu,August 16, 2018 12:27 PM
Priyanka Chopra Just Revealed Her Engagement Ring

బాలీవుడ్‌లో ఓ ఊపు ఊపిన ప్రియాంక చోప్రా ప్ర‌స్తుతం హాలీవుడ్ సినిమాల‌తో బిజీగా ఉంది. కొద్ది రోజులుగా త‌న ప్రేమ‌, పెళ్ళి వార్త‌ల‌తో హాట్ టాపిక్‌గా నిలిచిన ప్రియాంక చోప్రా అతి త్వ‌ర‌లోనే పెళ్లిపై అఫీషియ‌ల్ ప్ర‌క‌ట‌న చేయ‌నుంద‌ట‌. తాజాగా ఈ అమ్మ‌డు ప్రముఖ ఫ్యాషన్‌ డిజైనర్‌ మనీశ్‌ మల్హోత్రా ఏర్పాటు చేసిన విందుకు హాజ‌రైంది. ఆ పార్టీలో అంద‌రి దృష్టి త‌న ఎంగేజ్‌మెంట్ రింగ్‌పై ప‌డేలా ఫోటోల‌కి ఫోజులిచ్చింది. మొన్న‌టి వ‌ర‌కు సీక్రెట్‌గా దాచుకున్న రింగ్‌ని ఇప్పుడు బ‌య‌ట‌పెట్ట‌డంతో త్వ‌ర‌లో పెళ్ళి ప్ర‌క‌ట‌న రావ‌డం ఖాయ‌మంటున్నారు బాలీవుడ్ జ‌నాలు.

త‌న‌క‌న్నా ప‌ది సంవ‌త్స‌రాలు చిన్న వాడైన అమెరిక‌న్ సింగ‌ర్ నిక్ జొనాస్‌ని వివాహం చేసుకోబోతున్న ప్రియాంక‌కి త‌న ప్రియుడు తొడిగిన రింగ్ ధ‌ర అక్ష‌రాలా రెండు లక్షల డాలర్లు. అంటే మన కరెన్సీలో దాదాపు కోటి రూపాయలకు పైగానే. ఈ ఉంగరంలో నాలుగు క్యారెట్ల వజ్రాలు ఉన్నాయట. ఈ ఉంగ‌రం కోసం నిక్ జొనాస్ లండ‌న్‌లోని ప్ర‌ముఖ జ్యువెల‌రీ సంస్థ టీఫ‌నీ అండ్ కో కి వెళ్ళి ఆ దుకాణానికి ఇత‌ర క‌స్ట‌మ‌ర్స్ రాకుండా షాప్ మూయించేశాడ‌ట‌. ఒక్క‌డు తీరిక‌గా కూర్చొని షాప్‌లో ఉన్న అన్నీ రింగ్స్ ప‌రిశీలించి చివ‌రికి డైమండ్ ఉంగ‌రాన్ని ఎంపిక చేసిన‌ట్టు టాక్‌. ఆగ‌స్ట్ 18న ప్రియాంక ముంబైలోని ఫైవ్ స్టార్ హోట‌ల్‌లో త‌న స‌న్నిహితుల‌కి, ఫ్రెండ్స్‌కి గ్రాండ్ పార్టీ ఇవ్వ‌నుంద‌ట‌. అదే పార్టీలో త‌న పెళ్లి డేట్ కూడా ఎనౌన్స్ చేయ‌నుంద‌ని స‌మాచారం. అమెరికాలో త‌న స‌న్నిహితుల స‌మ‌క్షంలో ప్రియాంక త‌న నిశ్చితార్ధం జ‌రుపుకున్న సంగ‌తి తెలిసిందే.

5040
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles