త‌న పెళ్లిపై ప్రియాంక ఎగ్జైటింగ్‌గా ఉంది: కంగనా

Wed,August 1, 2018 01:46 PM
Priyanka Chopra is really excited for her wedding says kangana

కొద్ది రోజులుగా బాలీవుడ్‌లో హాట్ టాపిక్ ఏమంటే ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ పెళ్లి అని చెప్ప‌వ‌చ్చు. అక్టోబ‌ర్‌లో పెళ్లి చేసుకోనున్న ప్రియాంక త‌న మ్యారేజ్ కోసం వెడ్డింగ్ గౌన్ కూడా రెడీ చేసుకుంద‌నే వార్త‌లు వ‌చ్చాయి. అయితే ప్రియాంకకి క్లోజ్ ఫ్రెండ్ అయిన కంగ‌నాని మీడియా ప్ర‌తినిధులు ప్రియాంక పెళ్లెప్పుడు అని ప్ర‌శ్నిస్తుండ‌డంతో ఆమె ఆస‌క్తిక‌ర‌ స‌మాధానాలు చెబుతూ వ‌స్తుంది. రీసెంట్‌గా ఓ ఈవెంట్‌లో పాల్గొన్న కంగనాను మీడియా పలకరించింది. ప్రియాంకా, నిక్ జోనాస్ నిశ్చితార్థం ఎప్పుడ‌ని అడగగా.. "అవునా.. ప్రియాంకా నాకు క్లోజ్ ఫ్రెండ్. కాని తన నిశ్చితార్థం అయింది మాత్రం నాకు తెలియదు. నాకు పీసీ ఈ విషయమే చెప్పలేదు. నేను అప్‌సెట్ అయ్యా.." అంటూ తెలిపింది కంగనా.

ఆ త‌ర్వాత ప్రియాంక‌కి విషెస్ చెప్పిన‌ట్టు కంగనా పేర్కొంది . ఆ సంద‌ర్భంలో ప్రియాంక చాలా ఎగ్జైట్‌మెంట్‌తో పాటు సంతోషంగా అనిపించింది. ఒక వేళ ప్రియాంక పెళ్లి విష‌యం నిజ‌మైతే నేను ఆమెతో క‌లిసి ఆనందాన్ని పంచుకుంటాను. త‌ను నాకు చాలా స‌న్నిహితురాలు. ప్రియాంక పెళ్లి గురించి నేను చాలా ఎగ్జైటింగ్‌గా ఎదురు చూస్తున్నాను అంటూ వోగ్ బ్యూటీ అవార్డ్స్ కార్య‌క్ర‌మంలో మీడియా అడిగిన ప్ర‌శ్న‌ల‌కి స‌మాధానం ఇచ్చింది కంగనా. ప్రియాంక త‌న వెడ్డింగ్ డేట్ ఎప్పుడ‌నే విష‌యాన్ని చెప్ప‌లేద‌నే విష‌యం కూడా తెలియ‌జేసింది కంగ‌నా. మ‌ధుర్ బండార్కర్ తీసిన ఫ్యాషన్ సినిమాలో పీసీ, కంగనా క‌లిసి న‌టించిన సంగ‌తి తెలిసిందే. ప్రియాంక ప్ర‌స్తుతం ప‌లు హాలీవుడ్ సినిమాల‌తో బిజీగా ఉంటే, కంగనా న‌టించిన మ‌ణికర్ణిక చిత్రం వ‌చ్చే ఏడాది విడుద‌ల కానుంది. ఆగ‌స్ట్ 15న చిత్ర టీజ‌ర్ విడుద‌ల కానున్న‌ట్టు తెలుస్తుంది.

1249
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS