నా ఆత్మకథలో ఎవరిని విమర్శించలేదు: ప్రియాంక చోప్రా

Wed,June 20, 2018 04:54 PM
Priyanka Chopra auto biography come soon

అంతర్జాతీయంగా సినిమాలు చేస్తూ గ్లోబల్ భామగా పేరు ప్రఖ్యాతలు సంపాదించిన ప్రియాంక చోప్రా కలం చేత పట్టి ఆత్మకథ రాసుకుంది. ఇందులో తాను సేకరించిన వ్యాసాలు, కథలు, జీవితంలో ఎదుర్కొన్న సమస్యలు, పరిశీలించిన పలు సంఘటనలని వివరించింది. ఈ పుస్తకాన్ని నిజాయితీగా, ముక్కు సూటిగాచ సరదాగా, ఎవరిని విమర్శించకుండా రాసానంటూ పేర్కొంది ప్రియాంక. పెంగ్విన్ ర్యాండమ్ హౌజ్ ఇండియా పబ్లికేషన్స్ ప్రియాంక ఆత్మకథని ‘అన్‌ఫినిష్ఢ్‌’గా నామకరణం చేశారు.

ఇప్పటి వరకు తన ఆత్మకథని చెప్పుకునే అవసరం రాలేదని చెప్పిన ప్రియాంక ఇప్పుడు పుస్తక రూపంలో దానిని బయటకు తీసుకురావలసి వచ్చిందని స్పష్టం చేసింది. ఈ పుస్తకం చదివిన ఏ మహిళ అయిన తాను జీవితంలో ఏదైన సాధించగలను అనే నమ్మకాన్ని ఏర్పరచుకుంటారని పెంగ్విన్ ర్యాండమ్ హౌజ్ ఇండియా పబ్లికేషన్స్ సంస్థ కు చెందిన మానసి సుబ్రమణ్యం తెలిపారు. ప్రియాంకా చోప్రా కొన్నాళ్ళుగా అమెరికన్ సింగర్ నిక్ జొనాస్తో చెట్టాపట్టాలు వేస్తుంది. త్వరలో వీరిరివురు పెళ్లి పీటలు ఎక్కనున్నారని అంటున్నారు.

1028
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles