నాలుగు షేడ్స్‌లో క‌నిపించ‌నున్న ప్రియాంక చోప్రా

Sun,September 30, 2018 09:57 AM
Priyanka Chopra appears in four shaeds

బాలీవుడ్ నుండి హాలీవుడ్ వెళ్ళిన ప్రియాంక చోప్రా మ‌ళ్ళీ రెండేళ్ళ త‌ర్వాత హిందీ సినిమాలో న‌టించేందుకు సిద్ధ‌మైంది. స‌ల్మాన్‌తో క‌లిసి భార‌త్‌లో న‌టించాల్సి ఉన్నా ప‌లు కార‌ణాల వ‌ల‌న ఆ ప్రాజెక్ట్ నుండి త‌ప్పుకుంది. దీంతో ప్రియాంక స్థానంలో క‌త్రినాని క‌థానాయిక‌గా తీసుకున్నారు. ప్ర‌స్తుతం బాలీవుడ్‌లో ‘ది స్కై ఈజ్‌ పింక్‌’ చిత్రంలో నటిస్తుంది ప్రియాంక‌. ఇందులో ఫర్హాన్‌ అక్తర్‌ కథానాయకుడిగా నటిస్తున్నారు. ఇందులో ప్రియాంక 21ఏళ్ల కూతురున్న తల్లి పాత్రలో కనిపించడమే కాకుండా సినిమా మొత్తం మీద నాలుగు విభిన్నమైన పాత్రల్లో కనిపిస్తారట. ఆ పాత్ర‌లు ప్రేక్ష‌కుల మ‌తులు పోగొట్టేలా ఉంటాయ‌ని అంటున్నారు. సోనాలి బోస్‌ దర్శకత్వంలో రూపొందుతున్న ఈ చిత్రంలో జైరా వ‌సీమ్ కూడా ముఖ్య పాత్ర‌లో న‌టిస్తుంది. ప్రియాంక త‌ల్లిగా జ‌రీనా న‌టిస్తుంది. చిన్న వయసులో రోగ నిరోధక శక్తి చాలా తక్కువగా ఉన్నప్పటికీ, అసలు బ్రతకడమే కష్టమని డాక్టర్స్‌ చెప్పినా మోటివేషనల్‌ స్పీకర్‌గా, ఒక పుస్తక రచయితగా కూడా తన ప్రతిభ చాటుకున్న అయేషా చౌదరి కథనే ఈ చిత్రానికి మూలం అంటున్నారు. అయేషా పాత్ర‌లో జైరా క‌నిపించ‌నుండ‌గా, వయ‌సులోని వివిధ ద‌శ‌ల‌లో ప్రియాంక లుక్స్ ఉండ‌నున్న‌ట్టు తెలుస్తుంది. స్పూర్తినిచ్చే చిత్రంగా ఈ మూవీ ఉంటుంద‌ని అంటున్నారు. ప్రియాంక హాలీవుడ్ చిత్రం ‘ఇజింట్‌ ఇట్‌ రొమాంటిక్‌’ విడుద‌ల‌కి సిద్ధం కాగా, ఏ కిడ్ లైక్ జేక్ చిత్రం సెట్స్ పై ఉన్న సంగ‌తి తెలిసిందే.

1505
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles