18 కోట్లకు పెళ్లి ఫొటోలు అమ్ముకుంటున్నారు!

Sun,November 11, 2018 03:10 PM
Priyanka Chopra and Nick Jonas wedding pics sold for a whopping amount

సెలబ్రిటీల పెళ్లిళ్ల వార్తలు ఎంతో ఆసక్తి రేపుతాయి. వాళ్లు పెళ్లి చేసుకోబోయే తేదీ దగ్గరి నుంచి వేడుక ఎక్కుడ జరుగుతుంది? ఎవరు హాజరువుతున్నారు? పెళ్లికి ఎంత ఖర్చు పెడుతున్నారులాంటి వివరాలన్నీ అభిమానులకు ఆసక్తిగానే ఉంటాయి. అలాంటిదే ఇప్పుడో సెలబ్రిటీ పెళ్లి జరగబోతున్నది. ఓవైపు ఇటలీలో దీపికా పదుకోన్, రణ్‌వీర్ సింగ్ ఏడడుగులు వేయడానికి సిద్ధమవుతుంటే.. మరోవైపు వచ్చే నెల 2న జోధ్‌పూర్‌లో ఓ ఇంటి వాళ్లు కానున్నారు ప్రియాంకా చోప్రా, నిక్ జొనాస్. అయితే ప్రియాంకా, నిక్ పెళ్లికి సంబంధించిన ఓ వార్త ఇప్పుడు వైరల్‌గా మారింది. ఈ జంట తమ పెళ్లి ఫొటోలను భారీ మొత్తానికి అమ్ముకుందన్నది ఆ వార్త. ఓ ఇంటర్నేషనల్ మ్యాగజైన్‌కు తమ పెళ్లి ఫొటోల హక్కులను సుమారు 25 లక్షల డాలర్లు (సుమారు రూ.18 కోట్లు)కు ప్రియాంకా, నిక్ జోడీ అమ్ముకున్నట్లు వార్తలు వస్తున్నాయి. అయితే ఆ మ్యాగజైన్ పేరు మాత్రం బయటకు రాలేదు. ఈ మధ్య ప్రియాంకా పెళ్లి కూతురైన ఫొటోలు, బ్యాచిలర్ పార్టీ జరుపుకున్న ఫొటోలు ఇంటర్నెట్‌లో వైరల్‌గా మారిన సంగతి తెలిసిందే. ప్రియాంకా, నిక్ జొనాస్ జోడీ ఈ ఏడాది ఆగస్ట్‌లోనే ఎంగేజ్‌మెంట్ జరుపుకున్నారు.

4498
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles