ముంబైలో రిసెప్ష‌న్ ప్లాన్ చేసిన ప్రియాంక‌-నిక్ జంట‌

Wed,December 12, 2018 10:38 AM
Priyanka Chopra and Nick Jonas to host two wedding receptions in Mumbai

నూత‌న జంట ప్రియాంక చోప్రా, నిక్ జోనాస్ దంప‌త‌లు డిసెంబ‌ర్ 2న క్రైస్త‌వ ప‌ద్ద‌తిలో, 3న హిందూ సంప్ర‌దాయం ప్ర‌కారం వివాహం చేసుకున్న సంగ‌తి తెలిసిందే. జోథ్‌పూర్‌లోని ఉమైద్ ప్యాలెస్ భ‌వ‌న్‌లో వీరి వివాహం అంగ‌రంగ వైభవంగా జ‌రిగింది. ఆ త‌ర్వాత ఢిల్లీలో రిసెప్ష‌న్ ఏర్పాటు చేసింది ఈ జంట‌. ఈ వేడుకకి భార‌త ప్ర‌ధాని న‌రేంద్ర‌మోదీ హాజరై నూత‌న వ‌ధూవ‌రుల‌ని ఆశీర్వ‌దించారు. ప్ర‌స్తుతం హ‌నీమూన్ కోసం అరేబియ‌న్ దేశాలకి వెళ్లిన నిక్యాంక జంట (నిక్‌, ప్రియాంక జోడీ ముద్దుపేరు) త్వ‌ర‌లో ఇండియాకి రానుంది. వ‌చ్చిన కొద్దిరోజుల‌కి అంటే డిసెంబ‌ర్ 19న ఫ్యామిలీ, ఫ్రెండ్స్ కోసం జుహూలోని జేడ‌బ్ల్యూ మారియ‌ట్ హోట‌ల్‌లో ఒక రిసెప్ష‌న్ ,20న ప్ర‌ముఖ ఫైవ్ స్టార్ హోట‌ల్ తాజ్ ల్యాండ్స్‌లో మ‌రో రిసెప్ష‌న్ జ‌రుపుకోనున్నార‌ట‌. దీనికి హిందీ ప‌రిశ్ర‌మ నుండి ప‌లువురు సినీ ప్ర‌ముఖులు హాజ‌రు కానున్నార‌ని స‌మాచారం.

977
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles