ముంబైలో జ‌రిగిన‌ ప్రియాంక‌, నిక్‌ల రోకా సెర్మనీ

Sat,August 18, 2018 01:23 PM
Priyanka Chopra And Nick Jonas Roka completed

గ్లోబ‌ల్ భామ ప్రియాంక చోప్రా ,అమెరికన్ సింగర్ నిక్ జొనాస్‌ల ప్రేమ‌, పెళ్లిపై గ‌త కొద్ది రోజుల నుండి ఇటు అభిమానులు , అటు మీడియాలో సందిగ్దం నెల‌కొన‌గా వారి ప్రేమాయ‌ణంపై కొద్ది నిమిషాల క్రితం క్లారిటీ వ‌చ్చింది. పంజాబీ సాంప్రదాయ ప్రకారం కుటుంబ సభ్యులు మాత్రమే పాల్గొనే రోకా సెర్మనీ ప్రియాంక ఇంట్లో ఘ‌నంగా జ‌రిగింది. ఈ కార్య‌క్ర‌మం కోసం ప్రియాంక, నిక్‌లు సంప్ర‌దాయ భార‌తీయ దుస్తుల‌లో మెరిసారు. రోకా సెర్మ‌నీకి ప్రియాంక చోప్రా సోద‌రి ప‌ర‌ణితీ చోప్రా హాజ‌రైంది. నిక్ త‌ల్లితండ్రులు డెనిస్ మరియు కెవిన్ జోనాస్ కూడా సెర్మ‌నీలో పాల్గొన్నారు. సాయంత్రం ముంబైలోని ఫైవ్ స్టార్ హోట‌ల్‌లో త‌న స‌న్నిహితుల‌కి, ఫ్రెండ్స్‌కి గ్రాండ్ పార్టీ ఇవ్వ‌నుంద‌ట ప్రియాంక చోప్రా . అదే పార్టీలో త‌న పెళ్లి డేట్ కూడా ఎనౌన్స్ చేయ‌నుంద‌ని స‌మాచారం. ఈ పార్టీకి ప్రియాంక స‌న్నిహితులు క‌ర‌ణ్ జోహార్, ర‌ణ్‌వీర్ సింగ్ త‌దిత‌రులు హాజ‌రు కానున్న‌ట్టు స‌మాచారం. అమెరికాలో త‌న స‌న్నిహితుల స‌మ‌క్షంలో ప్రియాంక త‌న నిశ్చితార్ధం జ‌రుపుకున్న విష‌యం విదిత‌మే.


2609
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS