విచిత్ర వేష‌ధార‌ణ‌లో ప్రియాంక‌, దీపికా

Tue,May 7, 2019 11:25 AM
Priyanka Chopra And Deepika Padukone Slay The Red Carpet

న్యూయార్క్‌లోని మెట్రోపాలిటన్‌ మ్యూజియం ఆఫ్‌ ఆర్ట్స్‌, కాస్ట్యూమ్‌ ఇన్‌స్టిట్యూట్ ప్ర‌తి ఏడాది మెట్‌గాలా అనే షో నిర్వ‌హిస్తున్న సంగ‌తి తెలిసిందే. ఈ షోలో జ‌రిగే రెడ్ కార్పెట్‌లో పాల్గొనేందుకు మేటి మోడ‌ల్స్ విభిన్న దుస్తుల‌లో హాజ‌రవుతుంటారు. కొన్ని నెలల పాటు జ‌రిగే ఈ షోకి వచ్చే విరాళాల‌ని చారిటీల‌కి వినియోగిస్తారు. ఈ ఏడాది అమెరికాలో సోమ‌వారం ఘ‌నంగా ప్రారంభ‌మైంది. పలు అంత‌ర్జాతీయ వేడుక‌లలో మెరిసిన బాలీవుడ్ స్టార్స్ ప్రియాంక చోప్రా, దీపికా ప‌దుకొణేలు తాజాగా అమెరికాలోని న్యూ యార్క్‌లో జ‌రిగిన మెట్‌గాలా ఈవెంట్‌లో వెరైటీ డ్రెస్ ధ‌రించి అల‌రించారు. గ‌త ఏడాది పొడ‌గాటి గౌన్‌లో మెరిసిన ప్రియాంక ఈ సారి రింగుల జుట్టు, సిల్వర్‌ రంగు గౌను ధ‌రించి అంద‌రి దృష్టి త‌న వైపుకి తిప్పుకుంది. త‌న భ‌ర్త నిక్ జోనాస్‌తో క‌లిసి ప్రియాంక ఈ వేడుక‌కి హాజ‌రు కావ‌డం విశేషం. ఇక దీపికా ప‌దుకొణే కూడా ఈ కార్య‌క్ర‌మానికి హాజ‌రు కాగా ఆమె పింక్ క‌ల‌ర్ గౌన్‌లో బార్బీ బొమ్మలా ప్ర‌త్యేక ఆక‌ర్ష‌ణ‌గా నిలిచింది. మెట్‌గాలా కార్య‌క్ర‌మం ప్ర‌తి ఏడాది ఏదో ఒక థీమ్‌తో జ‌రుగుతూ ఉంటుంది. ఈ సారి ‘క్యాంప్‌: నోట్స్‌ ఆన్‌ ఫ్యాషన్‌’ అనే థీమ్‌తో కార్య‌క్ర‌మం జ‌రిగింది. రిలయన్స్‌ సంస్థల అధినేత ముఖేశ్‌-నీతా అంబానీల కుమార్తె ఇషా అంబానీ కూడా ఈ ఈవెంట్‌లో సంద‌డి చేశారు. గ‌తంలో ప్రియాంక డ్రెస్‌పై ఫుల్ ట్రోలింగ్ జరిగింది. ఆమె గౌన్‌పై ఫ‌న్నీ జోకులు వేశారు. మ‌రి ఈ సారి ప్రియాంక అవ‌తారంపై ఎంత‌టి ట్రోలింగ్ జ‌రుగుతుందో చూడాలి.


1630
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles