శ‌శిక‌ళ పాత్ర‌లో నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్..!

Tue,December 3, 2019 01:05 PM

త‌మిళ‌నాడు మాజీ ముఖ్యమంత్రి జ‌య‌ల‌లిత జీవిత నేప‌థ్యంలో తలైవీ అనే చిత్రం రూపొందుతున్న సంగ‌తి తెలిసిందే. కంగ‌నా ప్ర‌ధాన పాత్ర‌లో రూపొందుతున్న ఈ చిత్రాన్ని ఏఎల్ విజ‌య్ తెర‌కెక్కిస్తున్నారు. ఇటీవ‌ల చిత్ర ఫ‌స్ట్ లుక్ విడుద‌ల కాగా, ఇందులో కంగ‌నా లుక్ ప్రేక్ష‌కుల‌ని ఎంత‌గానో ఆక‌ట్టుకుంది. అయితే జ‌య‌ల‌లిత జీవితంలో ముఖ్య వ్య‌క్తి శ‌శిక‌ళ‌. ఆమె పాత్ర కోసం నేష‌న‌ల్ అవార్డ్ విన్న‌ర్ ప్రియ‌మ‌ణిని ఎంపిక చేసిన‌ట్టు స‌మాచారం. దీనిపై ఇంకా ఎలాంటి అధికారిక ప్ర‌క‌ట‌న రాలేదు. త‌లైవీ చిత్రానికి హలీవుడ్‌కు చెందిన ప్రముఖ మేకప్‌మెన్‌ జోసన్‌ కాలిన్స్ ప‌ని చేస్తున్న‌ట్టు తెలుస్తుంది. చిత్రంలో సినీ ప‌రిశ్ర‌మ‌కి రాక‌ముందు, సినీ ప‌రిశ్ర‌మ‌లో మంచి న‌టిగా రాణిస్తున్న స‌మ‌యంలో, రాజ‌కీయ అరంగేట్రం చేసిన‌ప్పుడు, ముఖ్యమంత్రిగా ఉన్న స‌మ‌యంలో ఇలా నాలుగు గెటప్స్‌లో కంగ‌నా సంద‌డి చేయ‌నుంద‌ట . ఈ చిత్రం కోసం కంగ‌నా రూ.20 కోట్లు పారితోషికాన్ని డిమాండ్‌ చేస్తోందని టాక్ న‌డుస్తుంది.

935
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles