కోర్టు నిర్ణయాన్ని స్వాగతించిన ప్రియావారియర్

Wed,February 21, 2018 05:52 PM
priya varrier welcomes supreme Court decision


తిరువనంతపురం: ‘ఒరు ఆధార్ లవ్’ ఫేం నటి ప్రియావారియర్, దర్శకుడు ఒమర్ లులూపై నమోదైన కేసులపై సుప్రీంకోర్టు స్టే విధించిన విషయం తెలిసిందే. సుప్రీంకోర్టు నిర్ణయాన్ని హీరోయిన్ ప్రియావారియర్ స్వాగతించింది. ఈ నేపథ్యంలో డైరెక్టర్ లులూ మాట్లాడుతూ కోర్టు నిర్ణయం మాకు పెద్ద ఉపశమనంలాంటిదని అన్నాడు. సినిమాలోని పాట వైరల్ అయ్యాక యూనిట్ అంతా సెలబ్రేషన్స్ చేసుకుందని..అయితే దీనికి వ్యతిరేకంగా నమోదైన కేసుల నుంచి ఉపశమనం దొరకడం సంతోషంగా ఉందని అన్నాడు. ఈ సినిమాలో నటించినవారంతా యువనటీనటులేనని లులూ అన్నాడు. ఒరు ఆధార్ లవ్ సినిమా షూటింగ్ 20 శాతం మాత్రమే పూర్తయింది. చిన్న రోల్‌లో నటించిన ప్రియావారియర్‌కు దేశవ్యాప్తంగా ఫ్యాన్ ఫాలోయింగ్ పెరిగింది. ఈ సినిమాలో ఐదుగురు హీరోహీరోయిన్లున్నారు. అయితే ప్రియావారియర్ అభిమానులను దృష్టిలో పెట్టుకుని ైక్లెమాక్స్ సీన్స్‌కు సంబంధించి స్క్రిప్ట్‌లో మార్పులు చేస్తున్నామని ఒమర్ లులూ తెలిపాడు. చిత్రయూనిట్ తరపు లాయర్ మాట్లాడుతూ దర్శకులకు అంతా మంచే జరుగుతుందనడానికి కోర్టు నిర్ణయమే నిదర్శనమన్నారు. తమపై క్రిమినల్ కేసులు నమోదవకుండా ఆదేశాలు జారీచేయాలని ప్రియావారియర్ సుప్రీంకోర్టును ఆశ్రయించిన విషయం తెలిసిందే.

2608
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS