ఇంట్లోనుంచి బయటికి రాలేని పరిస్థితి : ప్రియా వారియర్

Tue,January 22, 2019 07:37 PM

హైదరాబాద్ : జస్ట్ ఒక్కసారి కన్నుగీటి కుర్రకారు మనసు దోచుకున్న కేరళ కుట్టి ప్రియా ప్రకాశ్ వారియర్ హైదరాబాదుకొచ్చింది. ఆమె నటించిన ఒరు అడార్ లవ్ సినిమాలోని కన్నుగీటిన సీన్ సామాన్యుడి నుంచి ప్రముఖుల దాకా అందరినీ ఆకట్టుకంది. ఆ సినిమా టీజర్‌కు ఫుల్ క్రేజ్ వచ్చింది. దీంతో రాత్రికి రాత్రే ప్రియా వారియర్ స్టార్ హీరోయిన్ అయిపోయింది. ఎప్పుడైతే టీజర్ రిలీజైందో అప్పటినుంచి ఆమెకు ఫాలోయింగ్ పెరిగి పోయింది. ఒరు అడార్ లవ్ సినిమా ఫిబ్రవరి 14న విడుదల తెలుగు, తమిళ్, మళయాలం భాషలో అవుతుంది. ఈ నెల 23న సినిమా ప్రీరిలీజ్ ఫంక్షన్ జరగనుంది. ప్రచారంలో భాగంగా ప్రియా హైదరాబాద్‌లో మీడియాతో మాట్లాడారు. పాటలోని కన్నుగీటిన సీన్‌తోటి ఇంట్లోనుంచి బయటికి వచ్చే పరిస్థితి లేదని చెబుతున్నది. నేను ప్రస్తుతం బికాం సెకండ్ ఇయర్ చదువుతున్నాను. నేను పెద్ద నటి కావాలన్నది మా నాన్న కల. నా తొలి సినిమా ఒరు అడార్ లవ్. ఇందులో కన్నుగీటిన బామగా నేను పాపులర్ అయ్యాను. సోషల్ మీడియాలో మంచి క్రేజ్ రావటాన్ని ఎంజాయ్ చేశాను. నాకు చాలా సినిమా ఆఫర్లు వచ్చాయి. ఈసినిమా రిలీజ్ కానందుకు ఇంకా ఏ సినిమాకు ఒప్పుకోలేదు. అని ప్రియావారియర్ అంది.

6597
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles