స‌హాన‌టుడితో ప్రేమ‌లో ప‌డ్డ ప్రియా ప్ర‌కాశ్‌..!

Sat,August 24, 2019 01:37 PM
Priya Varrier post speaks rumors

ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్, రోష‌న్ అబ్ధుల్ రవూఫ్ ప్ర‌ధాన పాత్ర‌లో తెర‌కెక్కిన‌ చిత్రం ఒరు ఆదార్ ల‌వ్. ఈ చిత్రంలో ఇద్దరి న‌ట‌నకి మంచి మార్కులు ప‌డ్డాయి. అయితే వీరిద్ద‌రు సినిమా రిలీజ్‌కి ముందు, సినిమా రిలీజ్ త‌ర్వాత ఎక్కువ‌గా క‌లిసి క‌నిపిస్తుండ‌డంతో ఇద్ద‌రి మ‌ధ్య ప్రేమ చిగురించిందా అని నెటిజన్స్ అనుమానం వ్య‌క్తం చేశారు. దీనిపై అప్ప‌ట్లో క్లారిటీ ఇచ్చారు. మేమిద్దరం ఫ్రెండ్స్ మాత్ర‌మే . అంత‌కు మించి ఏమి లేదు అని స్ప‌ష్టం చేశారు. అయితే ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్ తాజాగా రోష‌న్‌ని గ‌ట్టిగా హ‌గ్ చేసుకొని దిగిన ఫోటోని త‌న ఫేస్‌బుక్‌లో షేర్ చేసింది. దీంతో నెటిజ‌న్స్‌లో మ‌రోసారి చ‌ర్చ మొద‌లైంది. ఇద్దరి మ‌ధ్య ఏమైన న‌డుస్తుందా అని డిస్క‌ష‌న్స్ మొద‌లు పెట్టారు. ప్రియా ప్ర‌కాశ్ త్వ‌ర‌లో నితిన్ 28వ సినిమాతో తెలుగు తెర‌కి ప‌రిచ‌యం కానుంది. చంద్ర‌శేఖ‌ర్ యేలేటి ద‌ర్శ‌క‌త్వంలో తెర‌కెక్క‌నున్న ఈ చిత్రంలో ర‌కుల్ ప్రీత్ సింగ్ క‌థానాయిక‌గా న‌టిస్తుంది.

14821
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles