మెగాస్టార్‌ని క‌లిసి ఆశీర్వాదం తీసుకున్న‌ సోష‌ల్ మీడియా సెన్సేష‌న్

Fri,February 1, 2019 12:05 PM
Priya Prakash Varrier turns fangirl for south superstar

క‌న్నుగీటు వీడియోతో కోట్లాది ప్రేక్ష‌కుల అభిమానాన్ని గెలుచుకున్న మ‌ల‌యాళం సెన్సేష‌న్ ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్‌. అతి త‌క్కువ టైంలో సెల‌బ్రిటీ స్టేట‌స్ పొందిన ఈ సోష‌ల్ మీడియా సెన్సేష‌న్‌కి ప్ర‌స్తుతం ఇన్‌స్టాగ్రాంలో 6.5 మిలియ‌న్ ఫాలోవ‌ర్స్ ఉన్నారు. ప్రియా న‌టించిన ఒరు ఆదార్ ల‌వ్ చిత్రం ఫిబ్ర‌వ‌రి 14న విడుద‌ల కానుండ‌గా, ఇటీవ‌ల త‌న అభిమానుల‌తో సోష‌ల్ మీడియా వేదిక‌గా ముచ్చ‌టించింది. నెటిజ‌న్స్ అడిగిన ప్ర‌శ్న‌ల‌కి ఓపిక‌గా బ‌దులిచ్చింది. తాజాగా త‌న ఇన్‌స్టాగ్రామ్‌లో మ‌ల‌యాళ మెగాస్టార్ మోహ‌న్‌లాల్‌తో క‌లిసి దిగిన ఫోటోని షేర్ చేసి ఆనందం వ్య‌క్తం చేసింది. నేను మోహ‌న్‌లాల్‌ని క‌లిసాను అనే విష‌యం న‌మ్మలేక‌పోతున్నాను. అంత పెద్ద లెజెండ్‌ని క‌లవ‌డం, ఆయ‌న‌తో కొద్ది సేపు స‌మ‌యం గ‌డ‌ప‌డం నా జీవితంలో ఎప్ప‌టికి మ‌రచిపోలేను. ఆయ‌న పాదాల‌ని తాకి ఆశీర్వాదం తీసుకోవ‌డం గ‌ర్వంగా ఫీల‌వుతున్నాను అని కామెంట్‌లో తెలిపింది ప్రియా ప్ర‌కాశ్‌. ఈ అమ్మ‌డు న‌టించిన ఒరు ఆదార్ ల‌వ్ చిత్రం తెలుగులో ల‌వ‌ర్స్ డే పేరుతో విడుద‌ల కానున్న సంగ‌తి తెలిసిందే.

4668
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles