నెటిజన్లకు అడ్డంగా దొరికిపోయిన ప్రియా ప్రకాశ్ వారియర్

Thu,April 11, 2019 03:39 PM

ప్రియా ప్రకాశ్ వారియర్.. ఆ పేరులోనే ఏదో మత్తు, గమ్మత్తు ఉంది. అందుకే కుర్రకారుకు ఆ పేరు వింటే చాలు.. వాళ్ల మదిలో అలజడి మొదలవుతుంది. ఒకసారి కన్నుకొట్టి కుర్రాళ్లకు నిద్ర లేకుండా చేసిన సుందరి ప్రియా ప్రకాశ్ వారియర్ గురించి ఎంత చెప్పినా తక్కువే. తను నటించింది ఇప్పటి వరకు ఒకే ఒక్క సినిమాలో అయినా.. తనకు ప్రపంచ వ్యాప్తంగా బీభత్సంగా ఫ్యాన్ ఫాలోయింగ్ ఉంది. ఇప్పుడు తన చేతినిండా సినిమాలు, యాడ్ ఫిలింస్, ప్రాడక్ట్స్ ప్రమోషనల్ యాక్టివిటీస్‌తో తన కెరీర్ మూడు పువ్వులు ఆరు కాయలుగా వర్ధిల్లుతోంది. గత సంవత్సరం గూగుల్‌లో ఇండియాలో ఎక్కువగా సెలబ్రిటీలను సెర్చ్ చేసిన జాబితాలో ప్రియా ప్రకాశ్ వారియరే నెంబర్ వన్ పొజిషన్‌లో నిలబడిందంటే తనకు ఎంత క్రేజ్ ఉందో అర్థం చేసుకోవచ్చు.

తాజాగా ప్రియా ప్రకాశ్ వారియర్ పప్పులో కాలేసింది. నెటిజన్లకు అడ్డంగా బుక్కయింది. ఇటీవల ప్రియా.. ఓ పర్‌ఫ్యూమ్ ప్రమోషనల్ యాక్టివిటీలో పాల్గొన్నది. ఈ సందర్భంగా ఆ బ్రాండ్‌కు ప్రమోట్ చేస్తూ దిగిన ఫోటోలను ప్రియా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది. తర్వాత ఆ పోస్ట్‌కు క్యాప్షన్ కూడా పెట్టింది. అక్కడే పప్పులో కాలేసింది. ఆ పోస్ట్‌కు ఏం క్యాప్సన్ ఇవ్వాలో ఆ బ్రాండ్ వాళ్లు తనకు కంటెంట్ ఇచ్చారు. ఆ కంటెంట్ ముందు టెక్స్ కంటెంట్ ఫర్ ఇన్‌స్టాగ్రామ్ అండ్ ఫేస్‌బుక్ అని రాసి ఉంది. అంటే.. ఇన్‌స్టాగ్రామ్, ఫేస్‌బుక్‌లో పోస్ట్ చేసినప్పుడు ఈ కంటెంట్ పెట్టాలని అర్థం. అయితే.. ప్రియా మాత్రం సూచనలు ఇచ్చిన ఆ కంటెంట్‌ను కూడా తన ఇన్‌స్టాగ్రామ్ అకౌంట్‌లో షేర్ చేసింది. ప్రియా చేసిన తప్పును కనిపెట్టిన నెటిజన్లు తనను ట్రోల్ చేయడం మొదలు పెట్టారు. కాపీ పేస్ట్ చేయడం కూడా సరిగ్గా రాదా? అంటూ తనపై కామెంట్ల వర్షం కురిపించారు. నెటిజన్ల నెగెటివ్ కామెంట్లను తట్టుకోలేక వెంటనే తన పోస్ట్‌ను సరిచేసుకుంది ప్రియా.

View this post on Instagram

Beauties Celebrating love with @Fasih_Perfumes. @snehaullal @kritivermaofficial @priya.p.varrier Introducing New Touch of French & Arabian Perfumes from Middle East. Designed for Men & Women for every Occasion. EAU DE PARFUM(100 ML), Perfume Spray(120 ML), French Fragrance Oil(15ML), Roll-On(8ML), Traveller Perfumes(30ML). FASIH PERFUMES Fragrances available Online at : Flipkart,Amazon and Snapdeal. Distribution Enquiry : +91 7506219202 For More Information Login to www.fasihperfumes.com Ad Agency: Pixelarabia.org Photographer: Sarath Shetty Director: Manish Kumar Creative: MD. Sohrab Ali Stylist: BienMode Makeup: Anjali Verma #FasihPefumes #GlobalBrandAmbassador #Fragrances #OudPerfumes #HalalPerfumes #Vegan  #Crueltyfree #WearYourScent #PerfumeLovers #Luxury #ArabianPerfumes #OudFragrance  #FrenchPerfumes #PerfumeForMen #PerfumesForWomen #MenFragrances #Scent #Amazon #Flipkart #SnapDeal

A post shared by priya prakash varrier (@priya.p.varrier) on

8128
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

Featured Articles

Health Articles