ప్రియా ప్ర‌కాశ్ టాలీవుడ్ ఎంట్రీ ఏ హీరోతో తెలుసా ?

Sun,January 27, 2019 08:48 AM
Priya Prakash Varrier tollywood entry with nani movie

క‌న్నుగీటుతో కోట్లాది ప్ర‌జ‌ల హృద‌యాల‌ని కొల్ల‌గొట్టిన అందాల భామ ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్‌. ఒరు ఆదార్ ల‌వ్ అనే చిత్రంతో వెండితెర‌కి ఎంట్రీ ఇచ్చింది ఈ అమ్మ‌డు. ఈ చిత్రం ఫిబ్ర‌వ‌రి 14న తెలుగు, మ‌ల‌యాళ భాష‌ల‌లో విడుద‌ల కానుంది. తెలుగులో ల‌వ‌ర్స్ డే పేరుతో రిలీజ్ కానుంది. అయితే ప్రియా ప్రకాశ్ టాలీవుడ్ ఎంట్రీ ఇవ్వ‌నుంద‌ని ఎప్ప‌టి నుండో వార్త‌లు వ‌స్తున్న‌ప్ప‌టికి దీనిపై క్లారిటీ రావ‌డం లేదు. ఆ మ‌ధ్య బ‌న్నీతో చేయ‌నుంద‌ని వార్త‌లు రాగా, తాజాగా నాని సినిమాతో తెలుగు తెర‌కి ప‌రిచ‌యం కానుంద‌ని అంటున్నారు. నాని ప్ర‌స్తుతం ‘మళ్లీరావా’ దర్శకుడు గౌతమ్‌ తిన్ననూరి దర్శకత్వంలో ‘జెర్సీ’ అనే స్పోర్ట్స్ డ్రామాలో నటిస్తున్నాడు. ఈ చిత్ర షూటింగ్ చివ‌రి ద‌శ‌కు చేరుకుంది. ఫిబ్ర‌వ‌రిలో మూవీ రిలీజ్ కానుంది. జెర్సీ రిలీజ్ త‌ర్వాత నాని.. విక్ర‌మ్ కుమార్ ద‌ర్శ‌క‌త్వంలో ఓ సినిమా చేయ‌నున్నాడు. ఈ సినిమాలో ప్రియా ప్ర‌కాశ్ వారియ‌ర్‌ని క‌థానాయిక‌గా తీసుకోవాల‌ని చిత్ర బృందం భావిస్తుంద‌ట‌. ప్రియా కూడా నాని సరసన నటించేందుకు ఓకే చెప్పిందని అంటున్నారు. మ‌రి వీటిపై క్లారిటీ రావ‌ల‌సి ఉంది.

3090
Follow us on : Facebook | Twitter

More News

VIRAL NEWS

country oven

Featured Articles

Health Articles